ఈపీఎఫ్ ఖాతాదారులకు గుడ్ న్యూస్. వచ్చే ఏడాది నుండి ఏటీఎంల నుండే పీఎఫ్‌ను విత్ డ్రా చేసుకోవచ్చు. ఈ మేరకు భారత కార్మిక మంత్రిత్వ శాఖ తన IT వ్యవస్థలను అప్‌గ్రేడ్ చేస్తోంది.ఇందులో భాగంగా ఈపీఎఫ్‌వో చందాదారులు వచ్చే ఏడాది నుంచి తమ ప్రావిడెంట్ ఫండ్స్ నేరుగా ఏటీఎంల నుంచే విత్‌డ్రా చేసుకోవచ్చని ల్యాబౌట్ సెక్రటరీ సుమితా దావ్రా తెలిపారు.
జీవన సౌలభ్యాన్ని మెరుగుపరిచేందుకు ప్రక్రియను సులభతరం చేయడానికి కృషి చేస్తున్నామన్నారు . ఒక క్లెయిమ్‌దారు, లబ్ధిదారుడు లేదా బీమా చేయబడిన వ్యక్తి తక్కువ మానవ ప్రమేయంతో ATMల ద్వారా సౌకర్యవంతంగా తమ క్లెయిమ్‌లను యాక్సెస్ చేయగలరు అని చెప్పారు.
EPFO సేవలను మెరుగుపరచడానికి, జీవన సౌలభ్యాన్ని పెంచడానికి ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాలకు అనుగుణంగా ఈ చర్యలు తీసుకుంటున్నామన్నారు. ఈపీఎఫ్ లబ్దిదారులకు ప్రయోజనాలలో వైద్య ఆరోగ్య కవరేజీ, ప్రావిడెంట్ ఫండ్‌లు మరియు వైకల్యం ఉన్న సందర్భాల్లో సాయం చేసే విధంగా ప్రణాళిక రెడీ చేస్తున్నామని చెప్పారు.
Also Read:ఈ వివాదానికి కారణం వినయ్: మనోజ్