గ్రీన్ ఛాలెంజ్‌కు పర్యావరణవేత్త ఏరిక్ సోల్హెమ్ మద్దతు

29
- Advertisement -

గ్రీన్ మ్యాన్ ఎంపీ సంతోష్ కుమార్ చేపట్టిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్ కు మద్దతు తెలిపారు ప్రముఖ పర్యవరణవేత్త ఏరిక్ సోల్హెమ్‌. గ్రీన్ ఇండియూ ఛాలెంజ్ కు మద్దతు తెలపడంపై గర్వంగా ఉందని తెలంగాణ,ఇండియా లో పచ్చదనం పెంపు కోసం అంకిత భావం తో పనిచేస్తుడటంపై ఎంపీ సంతోష్ కుమార్ పై ప్రశంసల జల్లు కురిపించారు.

పచ్చదనం పెంపు,సుస్థిరమయిన భారతదేశం కొరకు పనిచేస్తున్నట్లు ట్విట్టర్ వేదికగా వెల్లడించారు ఏరిక్ సోల్హెమ్. ఈ నేపథ్యంలో గ్రీన్ ఛాలెంజ్‌కు మద్దతు తెలిపిన ఏరిక్‌కు కృతజ్ఞతలు తెలిపారు ఎంపీ సంతోష్. పచ్చదనం, మరింత సుస్థిరమైన భారతదేశం కోసం మీ నిబద్ధత అందరికి స్ఫూర్తిదాయకం అని అన్నారు.గ్రీన్ ఇండియా చాలెంజ్ ప్రయాణంలో భాగమైనందుకు కృతజ్ఞతలు తెలిపారు.

Also Read:రివెంజ్ అంటే ఇదే.. టీమిండియా దెబ్బ అదుర్స్!

- Advertisement -