పరిసరాల పరిశుభ్రత మన బాధ్యతఃమంత్రి సింగిరెడ్డి

648
niranjanreddy
- Advertisement -

పరిసరాల పరిశుభ్రత మనందరి బాధ్యత అన్నారు రాష్ర్ట వ్యవసాయశాఖ మంత్రి నిరంజన్ రెడ్డి. వనపర్తి మున్సిపాలిటీలో స్వచ్చ వనపర్తి కార్యక్రమాన్ని మంత్రి నేడు ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి నిరంజన్ రెడ్డి మాట్లాడుతూ 15 రోజులలో పట్టణ రూపురేఖలు మారాలి. మన నగరాన్ని మనమే బాగుచేసుకుందామని చెప్పారు. 30 రోజుల ప్రణాళికతో గ్రామాల పరిస్థితి మెరుగుపడిందన్నారు. ఈ 15 రోజులు మనమంతా మన పాత్ర సమర్దవంతంగా నిర్వహిస్తే ప్రతి ఒక్కరం ఆరోగ్యంగా ఉంటామన్నారు.

ప్లాస్టిక్ రహిత వనపర్తి కోసం మనంఅందరం కృషిచేద్దాం. ప్లాస్టిక్ జీవితకాలం 400 ఏండ్లు..దాని జీవితకాలం పూర్తయ్యేలోపు దాని కాలుష్యాన్ని నీళ్ల ద్వారా, ఆహారం ద్వారా మనం భరిస్తూనే ఉండాలి. భావితరాల భవిష్యత్ ను దృష్టిలో ఉంచుకుని ప్లాస్టిక్ రహిత వనపర్తి జిల్లా కార్యక్రమం తీసుకున్నాం. ఇప్పుడు తెలంగాణ ప్రభుత్వం పూర్తిగా ప్లాస్టిక్ ను నిషేదిస్తూ నిర్ణయం తీసుకుంది. ప్రజలంతా ఈ కార్యక్రమానికి సహకరించాలన్నారు. స్వచ్చ వనపర్తి కార్యక్రమంలో తాను స్వయంగా పాల్గొని ఐదు రోజులు శ్రమదానం చేయనున్నట్లు తెలిపారు.

- Advertisement -