ప్రకృతి మనకు దేవుడు : మహతి

74
mahathi
- Advertisement -

ఎంపీ జోగినిపల్లి సంతోష్ కుమార్ చేపట్టిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్‌కు విశేష స్పందన లభిస్తోంది. ఈ కార్యక్రమానికి మద్దతు ప్రకటిస్తున్న ప్రముఖుల సంఖ్య రోజు రోజుకు పెరుగుతోంది. తాజాగా తెలంగాణ పబ్లిక్‌ సర్వీస్‌ కమీషన్‌ సభ్యురాలు సుమిత్రానంద్‌ ఆనంద్‌రావుల కుమార్తె మహతి 11వ పుట్టిన రోజు సందర్భంగా తమ ఇంటి అవరణలో మొక్కలు నాటారు. తన తల్లిదండ్రులతో కలిసి ఇంటి అవరణలో మామిడి, జామ, దానిమ్మ పండ్ల మొక్కలను నాటారు. ఇంత మంచి కార్యక్రమంలో పాల్గొని మొక్కలు నాటే ఆవకాశం కలిగినందుకు ఎంపీ సంతోష్ కుమార్‌కి కృతజ్ఞతలు తెలియజేశారు.

- Advertisement -