- Advertisement -
అక్కినేని నాగచైతన్య కథానాయకుడిగా విక్రమ్ కుమార్ రూపోందిస్తున్న తాజా చిత్రంగా ‘థ్యాంక్యూ’. దిల్ రాజు నిర్మించిన ఈ సినిమా, విభిన్నమైన ప్రేమకథగా ప్రేక్షకుల ముందుకు రానుంది. చైతూ సరసన నాయికలుగా రాశి ఖన్నా,మాళవిక నాయర్,అవికా గోర్ కనిపించనున్నారు. తమన్ ఈ సినిమాకి సంగీతాన్ని అందించాడు. జులై 8వ తేదీన ఈ సినిమాను విడుదల చేస్తున్నారు.
ఈ నేపథ్యంలో తాజాగా ఈ సినిమా నుంచి ఒక సాంగ్ ను విడుదల చేశారు మేకర్స్. “ఏంటో ఏంటేంటో.. నాలో ఏంటేంటో.. నాతో నువ్వేంటో’ అంటూ ఈ పాట సాగుతోంది. చైతూ.. మాళవిక నాయర్ పై చిత్రీకరించిన పాట ఇది. అనంత శ్రీరామ్ సాహిత్యాన్ని అందించిన ఈ పాటను, జొనిత గాంధీ ఆలపించారు. ఈ పాట యూత్ ను ఆకట్టుకునేలా ఉంది.
- Advertisement -