ఎన్నికల కోసమే బడ్జెట్‌:కవిత

51
- Advertisement -

కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ ప్రవేశ పెట్టిన బడ్జెట్‌పై బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత మండిపడ్డారు. మోదీ ప్రభుత్వం విఫలమైనందనడానికి ఈ బడ్జెట్‌ ఊదాహరణ అని ఆమె అన్నారు. తెలంగాణలో ఉద్యోగులకు మంచి జీతాలు చెల్లిస్తున్నామని కానీ 10లక్షల ఆదాయం వరకు పన్ను మినహాయింపు కల్పించడంపై ఆసహనం వ్యక్తం చేశారు. ఈ నిర్ణయం ద్వారా తెలంగాణ ఉద్యోగులకు నష్టం వాటిల్లుతుందని అన్నారు.

అసెంబ్లీ ఎన్నిక‌లు జ‌ర‌గ‌బోయే రాష్ట్రాలు లేదా బీజేపీ పాలిత రాష్ట్రాల‌కు మాత్రం ల‌బ్ధి చేకూరేలా కేంద్రం డెవ‌ల‌ప్‌మెంట్ ప్రాజెక్టుల‌ను ప్ర‌క‌టించింద‌ని ఎమ్మెల్సీ క‌విత అన్నారు. మౌళిక‌స‌దుపాయాల క‌ల్ప‌న కోసం ప‌దివేల కోట్లు కేటాయిస్తున్నార‌ని చెప్పార‌ని, కానీ ఎటువంటి మౌళిక‌సదుపాయాలో ఆ బ‌డ్జెట్‌లో వెల్ల‌డించ‌లేద‌ని ఆమె విమ‌ర్శించారు. తెలంగాణకు రావాల్సిన బాకీలు చెల్లించాలని ఆర్థికమంత్రిని కోరుతున్నట్టు కవిత డిమాండ్ చేశారు.

ఇవి కూడా చదవండి…

కేంద్ర వార్షిక బడ్జెట్… హైలైట్స్

దేశంలోనే నెంబర్‌వన్..కేజీ టూ పీజీ

పీఎం కేర్స్..కేంద్రంపై కేటీఆర్ ఆసహనం

- Advertisement -