వరల్డ్ కప్ లో భాగంగా నేడు ఇండియా, ఇంగ్లాండ్ జట్లు తలపడనున్నాయి. బర్మింగ్ హోమ్ వేదికగా జరుగుతున్న ఈమ్యాచ్ లో ఇంగ్లాండ్ టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంది. ఈ మ్యాచ్ లో ఆరెంజ్ జెర్సీతో భారత జట్టు బరిలోకి దిగనుంది. టోర్నీలో అపజయం ఎరుగని ఏకైకజట్టుగా ఉన్న టీమిండియా ఈ మ్యాచ్ లో గెలిస్తే నేరుగా సెమీస్ లో స్థానం సంపాదించుకుంటుంది. టీమిండియా ప్లేయర్ విజయశంకర్ స్థానంలో రిషబ్ పంత్ కు చోటు దక్కింది.
ఇంగ్లండ్ జట్టులో జేమ్స్ విన్స్, మోయిన్ అలీల స్థానంలో జాసన్ రాయ్, లియామ్ ప్లంకెట్కు అవకాశం లభించింది. ఈ రోజు జరిగే మ్యాచ్ లో తప్పనిసరిగా గెలవాల్సిన ఒత్తిడిలో ఇంగ్లాండ్ ఉంది. మరో వైపు పూర్తి స్థాయిలో జట్టుగా సమిష్టి ప్రదర్శనతో వరల్డ్ కప్ లో అందర్నీ ఆకట్టుకుని విజయాల పరంపరతో సాగుతున్న ఇండియా ఈమ్యాచ్ గెలిస్తే సెమీస్ కు చేరినట్టే. దీంతో ఇరుజట్లకు ఈమ్యాచ్ కీలకంగా చెప్పుకోవచ్చు.