మోర్గాన్ సునామీ..ఆప్ఘాన్ విలవిల

680
morgan
- Advertisement -

వరల్డ్‌ కప్‌లో ఇంగ్లాండ్‌ జైత్రయాత్ర కొనసాగుతోంది. నాలుగో విజయాన్ని అందుకున్న ఆతిథ్య ఇంగ్లాండ్‌ పాయింట్ల పట్టికలో నెంబర్ 1 స్ధానానికి ఎగబాకింది. మంగళవారం పసికూన ఆప్ఘనిస్తాన్‌పై భారీ విజయాన్ని నమోదుచేసింది. ఇంగ్లాండ్ విధించిన 398 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన అప్ఘాన్ ఏ దశలోనూ పోటీ ఇవ్వలేక పోయింది.

ఓపెనర్ నూర్ అలీ (0) ఆరంభంలోనే డకౌటయ్యాడు. రహ్మత్ షా (46),గుల్బుద్దీన్ (37) ,హస్మతుల్లా షాహిది (76),అస్గర్ (44 ) రాణించారు.దీంతో అప్ఘాన్‌ నిర్ణీత ఓవర్లలో 8 వికెట్లు కొల్పోయి 247 పరుగులు చేసింది. టోర్నీలో వరుసగా ఐదో మ్యాచ్‌లో ఓడిన అఫ్గానిస్థాన్ సెమీస్ అవకాశాల్ని చేజార్చుకుని పాయింట్ల పట్టికలో ఆఖరి స్థానానికి పరిమితమైంది.

అంతకముందు టాస్ గెలిచిన ఇయాన్ మోర్గాన్ బ్యాటింగ్ ఎంచుకున్నాడు. గాయపడిన ఓపెనర్ జేసన్ రాయ్ స్థానంలో జట్టులోకి వచ్చిన జేమ్స్ విన్స్ (26: 31 బంతుల్లో 3×4) ఆరంభంలోనే వికెట్ చేజార్చుకోగా.. అనంతరం వచ్చిన జోరూట్‌ (88: 82 బంతుల్లో 5×4, 1×6)తో కలిసి బెయిర్‌స్టో (90: 99 బంతుల్లో 8×4, 3×6) దూకుడుగా ఆడాడు. 71 బంతుల్లో 17 సిక్సులు, 4 ఫోర్లతో 148 పరుగులు చేసి జట్టు భారీ స్కోర్ సాధించడంలో కీలక పాత్ర పోషించాడు. దీంతో నిర్ణీత ఓవర్లలో ఇంగ్లాండ్ 397 పరుగులు చేసింది.

- Advertisement -