ఆసీస్ సిరీస్‌ను కంప్లీట్ చేసుకున్న భారత్ ఫిబ్రవరి 5 నుంచి ఇంగ్లాండ్‌తో టెస్టు సిరీస్ ఆడనుంది. ఇందుకోసం తొలి రెండు టెస్టుల కోసం భారత జట్టును బీసీసీఐ ప్రకటించింది. కరోనా మహమ్మారి వేళ రెండు మ్యాచ్‌లో ఎంఏ చిదంబరం స్టేడియంలోనే జరుగనున్నాయి. ఆల్ రౌండర్ హార్దిక్ పాండ్యా, పేసర్ ఇశాంత్ శర్మ జట్టులోకి పితృత్వ సెలవుల్లో ఉన్న కెప్టెన్ విరాట్ కోహ్లీ తిరిగి జట్టులోకి తిరిగి రానున్నారు. ఆసిస్ పర్యటనలో గాయపడ్డ ఆల్‌రౌండర్ జడేజా, బ్యాట్‌మెన్ హనుమ విహారి పేర్లను టీమ్ ఎంపిక సమయంలో పరిగణలోకి తీసుకోలేదని తెలుస్తోంది. ఇంగ్లాండ్ జట్టు భారత పర్యటనలో నాలుగు టెస్టులు, ఐదు టీ-20 మ్యాచ్, మూడు వన్డేలు ఆడనుంది
భారత జట్టు:
విరాట్ కోహ్లీ (కెప్టెన్), అజింక్య రహానె, రోహిత్ శర్మ, ఛతేశ్వర్ పూజారా, శుభ్‌మన్ గిల్, మయాంక్ అగర్వాల్, రిషబ్ పంత్, వృద్ధిమాన్ సాహా, హార్దిక్ పాండ్యా, కేఎల్ రాహుల్, ఆర్ అశ్విన్, వాషింగ్టన్ సుందర్, కుల్దీప్ యాదవ్ సుందర్, ఆక్సర్ పటేల్, జస్‌ప్రీత్ బుమ్రా, ఇశాంత్ శర్మ, మహ్మద్ సిరాజ్, శార్దుల్ ఠాకూర్.