మూడో టీ20లో భారత్‌ ఓటమి…

184
rohith
- Advertisement -

ఇంగ్లాండ్‌తో జరిగిన మూడో టీ20లో భారత్ ఓటమి పాలైంది. భారత్ విధించిన 157 పరుగుల లక్ష్యాన్ని ఇంగ్లండ్‌ 18.2 ఓవర్లలో 2 వికెట్లు మాత్రమే కోల్పోయి 158 పరుగులు చేసి చేధించింది. బట్లర్‌ (52 బంతుల్లో 83 నాటౌట్‌; 5 ఫోర్లు, 4 సిక్సర్లు) దంచికొట్టగా బెయిర్ స్టో 40 పరుగులు చేసి జట్టు విజయంలో కీలక పాత్ర పోషించాడు. దీంతో ఇంగ్లాండ్ 8 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది.

అంతకముందు టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన భారత్‌కు మంచి శుభారంభం దక్కలేదు. టాపార్డర్‌ ఘోరంగా విఫలమైంది. పవర్‌ ప్లే ముగిసేసరికి కోహ్లీసేన 24/3తో నిలిచింది. ఈ దశంలో విరాట్‌ కోహ్లీ (46 బంతుల్లో 77 నాటౌట్‌; 8 ఫోర్లు, 4 సిక్సర్లు) కెప్టెన్‌ ఇన్నింగ్స్‌తో అలరించాడు. దీంతో భారత్ నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్లు కొల్పోయి 156 పరుగులు చేసింది. మ్యాన్‌ ఆఫ్‌ ది మ్యాచ్‌గా జోస్‌ బట్లర్‌ నిలవగా ఈ గెలుపుతో ఐదు మ్యాచ్‌ల సిరీస్‌లో ఇంగ్లండ్‌ 2-1తో ఆధిక్యంలోకి దూసుకెళ్లింది.

- Advertisement -