ఇంగ్లాండ్తో జరిగిన రెండో వన్డేలో రోహిత్ సేన ఓటమి పాలైంది. 247 పరుగల లక్ష్యంతో బరిలోకి దిగిన భారత్..146 పరుగులకే ఆలౌటైంది. ఇంగ్లాండ్ 100 పరుగుల భారీతేడాతో విజయం సాధించింది. ఓపెనర్లు రోహిత్ శర్మ డకౌట్ కాగా, శిఖర్ ధావన్(9) ,రిషభ్ పంత్ 0,కోహ్లీ 16 పరుగులు చేయగా సూర్య కుమార్ (29 బంతుల్లో 27; 1 ఫోర్, 1 సిక్స్), హార్ధిక్ పాండ్యా(44 బంతుల్లో 29; 2 ఫోర్లు) , జడేజా (29; 44 బంతుల్లో 1×4, 1×6), షమి (23; 28 బంతుల్లో 2×4, 1×6) పర్వాలేదనిపించారు.
ఇక అంతకముందు టాస్ గెలిచిన టీమిండియా బౌలింగ్ తీసుకుంది. బ్యాటింగ్ కు దిగిన ఇంగ్లాండ్ బ్యాట్స్మెన్ ప్రారంభంలో తడబడటంతో 102 పరుగులకే అయిదు వికెట్లు కోల్పోయ్యారు. మెయిన్ అలీ, విల్లే పోరాడటంతో గౌరవప్రమైన స్కోరును 246 పరుగులు చేసింది. మూడు వన్డేల సిరీస్ 1-1తో సమానంగా మారగా విజేతను తేల్చే మూడో వన్డే ఈనెల 17న(ఆదివారం) మాంచెస్టర్లో జరుగుతుంది.