తొలి టీ20లో భారత్‌ ఓటమి..

420
England
- Advertisement -

కాన్పూర్‌ వేదికగా భారత్, ఇంగ్లాండ్ మధ్య జరిగిన తొలి టీ ట్వంటీ మ్యాచ్‌లో భారత్ ఓడిపోయింది. భారత్ నిర్దేశించిన లక్ష్యాన్ని ఇంగ్లండ్ జట్టు ఏడు వికెట్ల తేడాతో ఛేదించి విజయం సాధించింది. దీంతో మూడు టీ20ల సిరీస్‌లో ఇంగ్లాండ్‌ 1-0తో సిరీస్‌లో ఆధిక్యం సాధించింది. తొలుత బ్యాటింగ్ చేసిన భారత్ జట్టు నిర్ణిత ఓవర్లలో 148 పరుగులు చేసింది. భారత్ ఇచ్చిన లక్ష్యాన్ని ఇంగ్లండ్ జట్టు ఆడుతూ పాడుతూ 18.1 ఓవర్లలోమూడు వికెట్లు కోల్పోయి ఛేదించింది. ఇంగ్లండ్ ను కట్టడి చేయడంలో విఫలమై ఓటమి పాలైంది.
morgan
ఇంగ్లండ్ 43 పరుగులకే రెండు వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడ్డ తరుణంలో కెప్టెన్ ఇయాన్ మోర్గాన్(51) ఆదుకున్నాడు. జో రూట్తో కలిసి మూడో వికెట్ కు 83 పరుగుల విలువైన భాగస్వామ్యాన్ని సాధించాడు. ఆ క్రమంలోనే మోర్గాన్ 38 బంతుల్లో 4 సిక్సర్లు, 1 ఫోర్ సాయంతో హాఫ్ సెంచరీ మార్కును చేరాడు. ఆ తరువాత రూట్ -స్టోక్స్ల జోడి మిగతా పనిని పూర్తి చేసింది. రూట్ (46 నాటౌట్) బాధ్యతాయుతంగా ఆడగా, స్టోక్స్ (2నాటౌట్) మరో వికెట్ పడకుండా అండగా నిలిచాడు.

అంతకుముందు టాస్ ఓడి బ్యాటింగ్ చేసిన భారత జట్టు నిర్ణీత ఓవర్లలో ఏడు వికెట్ల నష్టానికి 147 పరుగులు చేసింది. ఈమ్యాచ్లో ఓపెనర్ గా వచ్చిన కెప్టెన్ విరాట్ కోహ్లి(29)ఫర్వాలేదనిపించగా, మరో్ ఓపెనర్ కేఎల్ రాహుల్(8) నిరాశపరిచాడు. ఆ తరువాత సురేశ్ రైనా(34; 23 బంతుల్లో 4 ఫోర్లు, 1 సిక్స్) బ్యాట్ ఝుళిపించడంతో భారత్ తిరిగి తేరుకుంది.
morgan
అయితే యువరాజ్ సింగ్(12) కూడా స్వల్ప వ్యవధిలోనే అవుట్ కావడంతో భారత్ జట్టు 75 పరుగులకే మూడు వికెట్లను నష్టపోయింది. కాగా, ఎంఎస్ ధోని (36 నాటౌట్;26 బంతుల్లో 3 ఫోర్లు) ఆకట్టుకోవడంతో భారత్ జట్టు గౌరవప్రదమైన స్కోరు చేసింది. ఇంగ్లండ్ బౌలర్లు మొయిన్ అలీ రెండు వికెట్లు సాధించగా, మిల్స్, జోర్డాన్, ప్లంకెట్, స్టోక్స్లకు తలో వికెట్ దక్కింది.

morgan

- Advertisement -