Ind Vs Eng:దుమ్మురేపిన భారత బౌలర్లు

25
- Advertisement -

ఉప్పల్ వేదికగా ఇంగ్లాండ్‌తో జరుగుతున్న తొలి టెస్టులో ఇంగ్లాండ్‌ 246 పరుగులకు ఆలౌట్ అయింది. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంది ఇంగ్లాండ్.కెప్టెన్స్ 70 పరుగులతో రాణించగా మిగితా బ్యాట్స్‌మెన్ పెద్దగా రాణించలేదు. జాక్ క్రాలీ (20),జో రూట్ (29), ఫోక్స్ (4), రెహన్ అహ్మద్ (12) ,మ్ హార్ట్లీ (23), మార్క్ వుడ్ (11) పరుగులు చేశారు. రవి చంద్రన్ అశ్విన్ 3, రవీంద్ర జడేజా 3, అక్షర్ పటేల్ 2, జస్‌ప్రీత్ బుమ్రా 2 వికెట్లు పడగొట్టారు.

తొలుత ఇన్నింగ్స్‌ను ధాటిగా ఆరంభించింది ఇంగ్లాండ్. ఓవర్‌కు 5కు పైగా రన్‌రేట్‌తో పరుగులు సాధించింది. ఓ దశలో 11.4 ఓవర్లలో 55/0తో నిలవగా స్పిన్‌ను రంగంలోకి దించారు రోహిత్. ఇది సత్ఫలితాన్నిచ్చింది. వెంటవెంటనే వికెట్లు తీయడంతో ఇంగ్లాండ్‌ను నిలువరించగలిగింది టీమిండియా.

Also Read:గంజితో ఎన్ని ఉపయోగాలో..!

- Advertisement -