ఇంగ్లాండ్‌ 81 ఆలౌట్.. గెలుపు దిశగా భారత్‌..

77
team india

అహ్మదాబాద్ లో భారత్, ఇంగ్లండ్ జట్ల మధ్య జరుగుతున్న మూడో టెస్టులో విరాట్‌ కోహ్లీ సారథ్యంలోని భారత్‌ గెలుపు దాదాపు ఖరారైంది. స్పిన్‌కు సహకరిస్తున్న వికెట్‌పై టీమిండియా మరోసారి ఆధిపత్యం ప్రదర్శించింది. సెకండ్‌ సెషన్‌లో భారత స్పిన్నర్లు మరింతగా విజృంభించడంతో ఇంగ్లాండ్‌ వందలోపే కుప్పకూలింది. రెండో ఇన్నింగ్స్‌లో 30.4 ఓవర్లలో 81 పరుగులకే ఆలౌటైన ఇంగ్లాండ్‌..భారత్‌కు 49 పరుగుల స్వల్ప లక్ష్యాన్ని నిర్దేశించింది.

భారత స్పిన్నర్ల దెబ్బకు ఇంగ్లాండ్‌ విలవిల్లాడింది. అక్షర్‌ పటేల్‌(5/32), రవిచంద్రన్‌ అశ్విన్‌(4/48) ఇంగ్లాండ్‌కు చుక్కలు చూపించారు. బ్యాట్స్‌మెన్‌ అంతా గింగిర్లు తిరిగే బంతులను ఎలా ఎదుర్కోవాలో అర్థంకాక పెవిలియన్‌కు క్యూ కట్టారు. ఇంగ్లీష్‌ బ్యాట్స్‌మెన్లలో జో రూట్‌(19), బెన్‌స్టోక్స్‌(25), ఓలీ పోప్‌(12) మినహా అంతా సింగిల్‌ డిజిట్‌కే వెనుదిరిగారు. తొలి ఇన్నింగ్స్‌లో ఆకట్టుకున్న జాక్‌ క్రాలే(0), డొమినిక్‌ సిబ్లే(7), జానీ బెయిర్‌స్టో(0), బెన్‌ ఫోక్స్‌(8) అలా వచ్చి ఇలా వెళ్లిపోయారు.

తొలి ఇన్నింగ్స్‌:

భారత్‌:145

ఇంగ్లాండ్‌: 112