తమను తక్కువ అంచనా వేయోద్దని పాకిస్థాన్ మరోసారి నిరూపించింది. ప్రపంచకప్ ఫేవరేట్,ఆతిథ్య ఇంగ్లాండ్‌కు గట్టిషాకిచ్చింది. వెస్టిండీస్‌తో జరిగిన మ్యాచ్‌లో చెత్త ప్రదర్శనతో ఇంటా,బయట విమర్శలను ఎదుర్కొన్న పాక్..ఇంగ్లాండ్‌పై ఆ కసిని తీర్చుకుంది.
349 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన ఇంగ్లాండ్‌కు ఇద్దరు బ్యాట్స్‌మన్ శతకాలు చేసినా.. ప్రపంచ నంబర్‌వన్ ఇంగ్లాండ్ ఊహించని విధంగా పరాజయంపాలైంది. రూట్ (107),బట్లర్ (103) సెంచరీలతో రాణించినా నిర్ణీత ఓవర్లలో 9 వికెట్లకు 334 పరుగులే చేయగలిగింది. చివరి రెండు ఓవర్లలో ఇంగ్లాండ్ 29 పరుగులు చేయాల్సివుండగా.. 49వ ఓవర్లో ఆమిర్ 4 పరుగులే ఇచ్చి ఆర్చర్‌ను ఔట్ చేయడంతో పాక్ విజయం లాంఛనమే అయింది. 14 పరుగుల తేడాతో ఆతిథ్య ఇంగ్లాండ్‌ను ఓడించింది.
అంతకముందు టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన పాక్ ధాటిగా ఇన్నింగ్స్‌ను ఆరంభించింది. హఫీజ్ (84; 62 బంతుల్లో 8×4, 2×6), బాబర్ అజామ్ (63; 66 బంతుల్లో 4×4, 1×6), సర్ఫ్‌రాజ్ (55; 44 బంతుల్లో 5×4) మెరవడంతో మొదట పాకిస్థాన్ 8 వికెట్లకు 348 పరుగులు చేసింది. బ్యాట్‌తో పాటు బంతితోనూ రాణించిన హఫీజ్‌కు ‘మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్’ లభించింది.