వినాయక చవితికి ‘ఎందుకో ఏమో’

359
- Advertisement -

మహేశ్వర క్రియేషన్స్‌ పతాకంపై నందు,నోయల్‌, పునర్నవి భూపాలం హీరో హీరోయిన్లుగా కోటి వద్దినేని దర్శకత్వంలో మాలతి వద్దినేని నిర్మిస్తోన్న చిత్రం ‘ఎందుకో ఏమో’. ఇటీవల ఈ చిత్రం టీజర్‌, సాంగ్స్‌ విడుదలై సినిమా పై మంచి క్రేజ్‌ ని ఏర్పరిచాయి. అన్ని కార్యాక్రమాలు పూర్తి చేసుకున్న ఈ చిత్రం సెప్టెంబర్‌ 12న వినాయక చవితి కానుకగా విడుదలవుతుంది. ఈ సందర్భంగా ఈ రోజు ప్రసాద్‌ ల్యాబ్స్‌లో పాత్రికేయుల సమావేశం ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో పాటల రచయిత మాట్లాడుతూ…‘‘ఈ చిత్రంలో పాటలన్నీ రాశాను. మంచి రెస్పాన్స్‌ వస్తోంది’’ అన్నారు.

enduko emo movieసింగర్‌ దీపు మాట్లాడుతూ…‘‘ఈ చిత్రం ద్వారా మా బ్రదర్‌ ప్రవీణ్‌ మ్యూజిక్‌ డైరక్టర్‌గా పరిచయం అవుతున్నారు. నేను ఇందులో మూడు పాటలు పాడాను. పాటలకు రెస్పాన్స్‌ బావుంది. సినిమా సక్సెస్‌ సాధించి టీమ్‌ అందరికీ మంచి పేరు తేవాలన్నారు.

సంగీత దర్శకుడు ఎమ్‌జికే ప్రవీణ్‌ మాట్లాడుతూ…‘‘మ్యూజిక్‌ కి స్కోపున్న స్టోరీ కావడంతో దర్శకుడు చెప్పిన సందర్భాలకు మంచి పాటలు ఇవ్వగలిగాను. మ్యాంగో ద్వారా విడుదలైన పాటలకు స్పందన బావుంది. మా ఆడియో లాగే సినిమాను కూడా హిట్‌ చేస్తారని కోరుకుంటున్నా’’ అన్నారు. సినిమాటోగ్రాఫర్‌ జియస్‌ఆర్‌ మురళి మాట్లాడుతూ..‘‘దర్శకుడు క్లారిటీతో సినిమా చేశారు. నిర్మాత ఎక్కడా రాజీ పడకుండా నిర్మించారు’’ అన్నారు.

నటుడు నోయల్‌ మాట్లాడుతూ…‘‘నందు మంచి యాక్టర్‌. తనతో ఎప్పటి నుంచో చేయాలనుకుంటున్నా…ఈ సినిమాతో కుదిరింది. ఈ సినిమాకు సంగీతం, సినిమాటోగ్రఫీ ప్రధాన ఆకర్షణలు . పునర్నవి సహజ నటి. ఈసినిమాతో తనకు మంచి పేరొస్తుంది. ఇంత మంచి సినిమాలో అవకాశం కల్పించిన దర్శక నిర్మాతలకు ధన్యవాదాలు ’` అన్నారు.
నటి పునర్నవి భూపాలం మాట్లాడుతూ..‘‘ మా నిర్మాత మాలతి గారు ఫస్ట్‌ సినిమా అయినా కాంప్రమైజ్‌ కాకుండా నిర్మించారు. నాకు కాస్ట్యూమ్స్‌ కూడా తనే డిజైన్‌ చేశారు. అలాగే మా డైరక్టర్‌ చెప్పిన లైన్‌కి ఎగ్జైట్‌ అయి వెంటనే సినిమా ఒప్పుకున్నా. సోషల్‌ నెట్‌ వర్క్స్‌ వ్ల వల్ల ఎలాంటి సమస్యలు ఎదురవుతున్నాయన్నది మా చిత్రంలో చూపించే ప్రయత్నం చేశారు దర్శకుడు. నందు, నోయల్‌ ఎంతో సపోర్ట్‌ చేశారు. ఈ సినిమాతో వారిద్దరు మంచి ఫ్రెండ్సయ్యారు’’ అన్నారు.

హీరో నందు మాట్లాడుతూ..‘‘లేడీ ప్రొడ్యూసర్‌ తో సినిమా చేయడం ఇదే ప్రధమం. ఎంతో అభిరుచితో సినిమా చేశారు. మా దర్శకుడు నన్ను నమ్మి ఈ సినిమాలో అవకాశం కల్పించారు. సంగీతం, సినిమాటోగ్రఫీ సినిమాకు హైలెట్స్‌. పునర్నవి, నోయల్‌ మంచి ఫ్రెండ్సయ్యారు’’ అన్నారు.

దర్శకుడు కోటి వద్దినేని మాట్లాడుతూ…‘ ఇదొక ట్రయాంగిల్‌ వ్‌స్టోరి. ఫ్యామిలీ, యూత్‌ కి నచ్చే విధంగా ఉంటుంది. నందు, నోయల్‌,పునర్నవి పోటా పోటీగా నటించారు. క్లైమాక్స్‌ సినిమాకు హైలైట్‌గా నిలుస్తుంది. కథ, కథనాలు కొత్తగా ఉంటూ అన్ని వర్గాల ప్రేక్షకులకు నచ్చే విధమైన ఎంటర్టైన్మెంట్‌ ఉంటుంది. సెప్టెంబర్‌ 12 న గ్రాండ్‌ గా సినిమా రిలీజ్‌ అవుతుంది’’ అన్నారు.
నిర్మాత మాతి వద్దినేని మాట్లాడుతూ…‘‘మహేశ్వర క్ర్రియేషన్స్‌ పతాకంపై ఇది మా తొలి సినిమా. మంచి లవ్ స్టోరీ తో పాటు కమర్షియల్‌ హంగులు కూడా సినిమాలో ఉన్నాయి.

నిజాయితీగా చేసిన ప్రయత్నమిది. మంచి కాన్సెప్ట్స్‌తో వచ్చే చిత్రా లను ప్రేక్షకులు ఆదరిస్తున్నారు. అలా మంచి కాన్సెప్ట్‌తో వచ్చే సినిమా ఇది . మా యూనిట్‌ అంతా పూర్తి సహాయ సహకారాలు అందించడంతో సినిమాను అనుకున్నవిధంగా పూర్తి చేయగలిగాం. సెన్సార్‌ కంప్లీట్‌ అయ్యింది. వినాయక చవితి కానుకగా సెప్టెంబర్‌ 12న విడుదల చేస్తున్నాం’’అన్నారు.

- Advertisement -