బీసీసీఐ ఇచ్చిన షాక్‌తో రిటైర్మెంట్ యోచనలో ధోని..!

407
dhoni
- Advertisement -

ఐపీఎల్ తర్వాత భారత జట్టులోకి ధోని ఎంట్రీ ఖాయం అని అంతా అనుకుంటుండగానే బీసీసీఐ ధోనికి షాకిచ్చింది. 2019 అక్టోబర్ నుంచి 2020 సెప్టెంబర్ వరకు ప్లేయర్ల కాంట్రాక్టు ఖరారు కాగా ధోనికి చోటివ్వలేదు బీసీసీఐ.

ఏ గ్రేడ్‌లో అశ్విన్,జడేజా,మహ్మద్ షమీ,భువనేశ్వర్,పుజారా,కేఎల్ రాహుల్‌కు చోటిచ్చిన బీసీసీఐ ధోనికి లిస్టులో పేరు ఇవ్వలేదు. దీంతో ధోని కెరీర్‌ ముగిసినట్లేనని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

ప్రపంచకప్ తర్వాత భారత జట్టుకు దూరమయ్యారు ధోని. ఈ సారి ఐపీఎల్‌లో రాణించి తిరిగి ధోని జట్టులోకి వస్తాడని అంతా భావిస్తుండగా షాకింగ్ నిర్ణయం తీసుకుంది బీసీసీఐ.

గ్రేడ్ ఏ+ ఆటగాళ్లు..

విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ,జస్పీత్ బుమ్రా

గ్రేడ్ ఏ ఆటగాళ్లు

అశ్విన్,జడేజా,భువనేశ్వర్,పుజారా,రహానే,రాహుల్,ధావన్,షమీ,ఇషాంత్ శర్మ,కుల్దీప్ యాదవ్,రిషబ్ పంత్

గ్రేడ్ బీ ఆటగాళ్లు

సాహా,ఉమేశ్ యాదవ్,చాహల్,హార్దిక్ పాండ్య,మయాంక్ అగర్వాల్

గ్రేడ్ సీ ఆటగాళ్లు

కేదార్ జాదవ్,నవ్ దీప్ సైని,దీపక్ చాహర్,మనీష్ పాండే,హనుమ విహారి,శార్దూల్ ఠాకూర్,శ్రేయస్ అయ్యర్,వాషింగ్టన్ సుందర్

- Advertisement -