మాన‌వ అక్ర‌మ ర‌వాణా క‌ట్ట‌డికి కృషి చేయాలి- గ‌వ‌ర్న‌ర్

87

హ్యుమ‌న్ ట్రాఫికింగ్ ఫ‌ర్ డ్యూటీ బేర‌ర్స్ పుస్త‌కాన్ని రాష్ట్ర గ‌వ‌ర్న‌ర్ త‌మిళిసై సౌంద‌ర‌రాజ‌న్ ఆవిష్క‌రించారు. ప్ర‌పంచ వ్య‌క్తుల ట్రాఫికింగ్ వ్య‌తిరేక దినోత్స‌వం సంద‌ర్భంగా గ‌వ‌ర్న‌ర్ శుక్ర‌వారం ఈ పుస్త‌కాన్ని ఆవిష్క‌రించారు. ప్ర‌జ్వ‌ల ఫౌండేష‌న్ ఆధ్వ‌ర్యంలో హ్యాండ్ బుక్స్ ప్ర‌చుర‌ణ‌. ఈ సంద‌ర్భంగా గ‌వ‌ర్న‌ర్ మాట్లాడుతూ.. మాన‌వ అక్ర‌మ ర‌వాణా క‌ట్ట‌డికి స‌మష్టిగా కృషి చేయాల‌ని పిలుపునిచ్చారు. అక్ర‌మ ర‌వాణా ద్వారా మాన‌వ హ‌క్కుల ఉల్లంఘ‌న జ‌రుగుతుంద‌న్నారు. బాధితుల‌ను వివ‌క్ష‌కు గురిచేయ‌కుండా పున‌రావాసానికి కృషి చేయాల‌ని పిలుపునిచ్చారు. ప్ర‌జ్వ‌ల సంస్థ ద్వారా సునీతా కృష్ణ‌న్ కృషి అభినందనీయం పేర్కొన్నారు.