- Advertisement -
మావోయిస్టులకు మరో షాక్ తగిలింది. ఛత్తీస్‌గఢ్‌లో జరిగిన ఎన్‌కౌంటర్‌లో 10 మంది మావోయిస్టులు మృతిచెందారు. సోమవారం సాయంత్రం జరిగిన ఎన్‌కౌంటర్‌లో ఇద్దరు మహిళా మావోయిస్టులు చనిపోగా మొత్తం 12 మంది మరణించారు.
గరియాబంద్ అటవీ ప్రాంతంలో పోలీసులకు నక్సల్స్ తారసపడ్డారు. దీంతో ఇరుపక్షాల మధ్య జరిగిన ఎదురు కాల్పుల్లో 10 మంది మావోయిస్టులు మరణించారు. ఘటనా స్థలంలో భారీగా ఆయుధాలు, మందుగుండు సామాగ్రి స్వాధీనం చేసుకున్నారు.
ఈ నెల 16న ఛత్తీస్‌గఢ్‌లోని బీజాపూర్ జిల్లా పూజారికాంకేర్ ప్రాంతంలో జరిగిన ఎన్‌కౌంటర్‌లో 12 మంది మావోయిస్టులు మరణించిన సంగతి తెలిసిందే.
Also Read:దిల్ రాజు, మైత్రీ మేకర్స్ పై ఐటీ సోదాలు
- Advertisement -