సమ్మె విరమించి చర్చలకు వెళ్లండి: హైకోర్టు

554
rtc strike
- Advertisement -

ఆర్టీసీ కార్మికులు సమ్మె విరమించి ప్రభుత్వంతో చర్చలకు వెళ్లాలని కార్మికులకు హైకోర్టు సూచించింది. ఆర్టీసీ సమ్మెపై ప్రభుత్వం,యూనియన్ తరపు న్యాయవాదుల వాదనలు విన్న న్యాయస్ధానం …పండుగ సమయంలో సమ్మె చేయడం సమంజసమేనా? అని కార్మికులను ప్రశ్నించింది.

నిరసనను వ్యక్తం చేయడానికి అనేక మార్గాలు ఉన్నాయని…వెంటనే సమ్మెను విరమించి, చర్చలకు వెళ్లాలని సూచించింది. ఉద్యోగులపై ప్రభుత్వం ఎస్మా ప్రయోగిస్తే ఏం చేస్తారని ప్రశ్నించింది.

ప్రభుత్వం తరపున అడ్వొకేట్ జనరల్ వాదిస్తూ, ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయలేమని చెప్పారు. ప్రజలకు ఇబ్బంది లేకుండా ప్రత్యామ్నాయ ఏర్పాట్లను చేశామని తెలిపారు. అనంతరం తదుపరి విచారణను ఈనెల 18కి హైకోర్టు వాయిదా వేసింది.

- Advertisement -