టిటిడికి ఉద్యోగులే బ్రాండ్ అంబాసిడర్‌లు

0
- Advertisement -

టిటిడికి ఉద్యోగులే బ్రాండ్ అంబాసిడర్‌ లని టిటిడి ఈవో శ్రీ జే.శ్యామలరావు అభివర్ణించారు. వైకుంఠ ఏకాదశి సందర్భంగా ఉద్యోగులు మరింత బాధ్యతాయుతంగా విధులు నిర్వర్తించాలని సూచించారు.
తిరుమలలోని ఆస్థాన మండపంలో బుధవారం సాయంత్రం అడిషనల్ ఈవో శ్రీ సిహెచ్ వెంకయ్య చౌదరి తో కలిసి ఉద్యోగుల సమావేశంలో పలు సూచనలు చేశారు.

ఈ సందర్భంగా ఈవో మాట్లాడుతూ టీటీడీలో సమిష్టిగా పనిచేసే పటిష్టమైన యంత్రాంగం ఉందన్నారు. ఇటీవల తిరుమల శ్రీవారి బ్రహ్మోత్సవాలు, తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి వార్షిక బ్రహ్మోత్సవాలను వైభవంగా విజయవంతం చేశారన్నారు. వైకుంఠ ఏకాదశి సందర్భంగా భక్తులకు వైకుంఠ ద్వార దర్శనం కల్పించేందుకు మరింతగా మన్ననలు పొందేలా పనిచేయాలన్నారు.

వాట్సాప్‌ లో అన్ని ముఖ్యమైన అంశాలను సిబ్బంది మొబైల్‌లకు పంపుతారని, తద్వారా భక్తులకు సరైన పద్దతిలో మార్గనిర్దేశం చేయాలని సూచించారు. ఈ ఏడాది భక్తుల కోసం మరింత మెరుగ్గా అన్నప్రసాదం మెనూని పంపిణీ చేస్తామన్నారు.

అంతకుముందు అడిషనల్ ఈవో ప్రసంగిస్తూ దేశంలోని వివిధ ప్రాంతాల నుంచి, విదేశాల నుంచి వస్తున్నారని, వారి సాంప్రదాయాలకు అనుగుణంగా సేవలు అందించడం ప్రతిరోజూ సవాల్ తో కూడిన అంశమన్నారు. “గరుడ సేవ మరియు వైకుంఠ ఏకాదశి రోజులు చాలా సున్నితమైనవని, ఈ ప్రధాన రోజుల్లో భక్తులతో మమేకం కావడానికి మరింత ఓర్పు మరియు నైపుణ్యంతో కూడిన కార్యాచరణ అవసరమన్నారు.

ప్రపంచ ప్రఖ్యాత సంస్థ అయిన టిటిడి సంస్థలో ప్రాతినిధ్యం వహిస్తున్నందున ఉద్యోగులు కొన్ని నిర్దేశిత మార్గదర్శకాలను పాటించాలని సూచించారు. “సంప్రదాయ దుస్తులు ధరించాలని, మర్యాదపూర్వకంగా మాట్లాడాలని, యాత్రికులకు పార్కింగ్ స్థలాలు, వేచియుండే పాయింట్లలో సరైన పద్ధతిలో మార్గనిర్దేశం చేయాలన్నారు. ముందుగా వైకుంఠ ఏకాదశికి భక్తుల కోసం టిటిడి చేస్తున్న అన్ని ఏర్పాట్లను డిప్యుటేషన్ వచ్చే సిబ్బంది తెలుసుకోవాలని సూచించారు.

Also Read;తిరుపతి ఘటనపై మోదీ దిగ్భ్రాంతి

- Advertisement -