‘ఏమ్ మనసో’ మనోజే రాశాడు

45
- Advertisement -

గ‌త కొంత‌కాలంగా సినిమాల‌కు దూరంగా ఉంటున్న టాలీవుడ్ హీరో మంచు మనోజ్, దివంగ‌త నేత భూమా నాగిరెడ్డి రెండో కుమారై భూమా మౌనిక‌రెడ్డిని రీసెంట్ గా వివాహం చేసుకున్న సంగతి తెలిసిందే. మ‌నోజ్ ప్ర‌స్తుతం త‌న పెళ్లి జీవితాన్ని ఎంతో ఆనందంగా గ‌డుపుతున్నాడు. ఈ నేప‌థ్యంలోనే మ‌నోజ్ త‌న భార్య కోసం ఓ స్పెష‌ల్ సాంగ్‌ను రాయించి మ‌రీ కంపోజ్ చేయించి డెడికేట్ చేశాడు. ఈ వీడియోను మ‌నోజ్ రిలీజ్ చేశాడు. ఇది ‘శివుని ఆజ్ఞ’ అంటూ వీడియో ఆఖ‌రిలో మ‌నోజ్ చెప్పుకొచ్చాడు.

Also read: ప్చ్.. సిద్ధార్థ్ ఆశ అత్యాశే

ఈ స్పెషల్ వీడియో సాంగ్‌ ను మంచు మనోజ్ సోషల్ మీడియాలో పోస్టు చేస్తూ.. ఓ ఎమోషనల్ మెసేజ్ ను కూడా పోస్ట్ చేశాడు.‘ఇలాంటి నిజమైన ప్రేమ ఎవరి జీవితంలోనైనా ఒక్కసారే దొరుకుతుంది. అవును, ఇది నిజం నువ్వు నాకోసమే ఉన్నావని నాకు తెలుసు. ఎప్పటికీ నేను పూర్తిగా నీ వాడినే. నిజంగా ప్రేమిస్తే ఎలా ఉంటుందో నాకు చూపించినందుకు నీకు స్పెషల్ థ్యాంక్స్’ అంటూ మనోజ్.. తన భార్యను ఉద్దేశించి ట్వీట్ చేశారు.

Also read: Anni Manchi Sakunamule:ఇటలీలో కలవండి

అన్నట్టు ‘ఏమ్ మనసో’ అంటూ సాగే ఈ పాటను అనంత శ్రీరామ్ రాశారు. మనోజ్ దగ్గర ఉండి మరీ ఈ పాటను రాయించుకున్నాడట. పైగా ఇందులో కొన్ని లైన్స్ మనోజే సొంతంగా రాశాడని తెలుస్తోంది. మొత్తానికి భార్య కోసం మంచు మ‌నోజ్ ఇలా స్పెష‌ల్ సాంగ్ చేయడం, అది కాస్త.. బాగా వైరల్ కావడం విశేషం. మోహన్ బాబుకి ఇష్టం లేకుండానే మనోజ్ పెళ్లి చేసుకున్నాడని వార్తలు వచ్చినా ఇప్పుడు అందరూ సంతోషంగా ఉన్నారు.

- Advertisement -