ఎలన్ మస్క్…సంచలన నిర్ణయం

6
- Advertisement -

టెస్లా అధినేత ఎలన్ మస్క్ సంచలన నిర్ణయం తీసుకున్నాడు. డోజ్ చీఫ్ పదవి నుంచి తప్పుకుంటున్నట్లు ట్వీట్ చేశారు మస్క్. కేబినెట్ లో తనకు అవకాశం కల్పించిన ట్రంప్ కు థ్యాంక్స్ అంటూ పోస్ట్ చేశారు.

ట్రంప్, మస్క్ మధ్య చిచ్చుపెట్టింది ‘వన్ బిగ్ బ్యూటిపుల్’ బిల్లు. ట్రంప్ కొత్త పన్ను విధానాన్ని విమర్శించిన మర్నాడే మస్క్ ఈ నిర్ణయం తీసుకోవడం గమనార్హం. డోజ్‌పై ప్రజల్లో వ్యతిరేకత, సొంత యంత్రాంగంలో విమర్శలు రావడంతో ఆయన వైదొలిగినట్లు తెలుస్తోంది. ఇకపై వ్యాపారాలపై దృష్టి పెట్టనున్నట్లు మస్క్ పేర్కొన్నారు.

డోజ్‌ చీఫ్‌గా మస్క్‌ తీసుకున్న నిర్ణయాలపై తీవ్ర వ్యతిరేకత, విమర్శలు వ్యక్తమయ్యాయి. అంతేకాదు, ఆయన షాడో అధ్యక్షుడిగా వ్యవహరిస్తున్నారనే ఆరోపణలు వెల్లువెత్తాయి. మస్క్‌ తీరుపై ట్రంప్ యంత్రాంగంలోని అధికారులు కూడా మండిపడుతున్నారు. ఈ పరిణామాల నేపథ్యంలో ఎలాన్ మస్క్ డోజ్‌కు రాజీనామా చేయడం ప్రాధాన్యత సంతరించుకుంది.

Also Read:GIC:హరితసేనలో నటి మధుమిత

- Advertisement -