ఎలాన్ మస్క్..ఆసక్తికర విషయాలు

5
- Advertisement -

తన పార్టనర్‌ శివోన్ జిలిస్‌కు భారతీయ వేర్లు ఉన్నాయని, తమ కుమారుడికి భారతీయ మూలాలున్న శాస్త్రవేత్త, నోబెల్ బహుమతి గ్రహీత సుబ్రహ్మణ్యన్ చంద్రశేఖర్ పేరు పెట్టినట్లు ఎలాన్ మస్క్ వెల్లడించారు. టెస్లా మరియు స్పేస్ ఎక్స్ సీఈఓ ఎలాన్ మస్క్, న్యూరాలింక్ ఎగ్జిక్యూటివ్ శివోన్ జిలిస్ హాఫ్-ఇండియన్ అని, తమ కుమారుల్లో ఒకరి మధ్య పేరు ‘శేఖర్’గా పెట్టామని తెలిపారు. ప్రసిద్ధ భారతీయ-అమెరికన్ భౌతిక శాస్త్రవేత్త సుబ్రహ్మణ్యన్ చంద్రశేఖర్ గౌరవార్థమే ఈ పేరు పెట్టినట్లు చెప్పారు.

నా పార్టనర్ శివోన్ హాఫ్ ఇండియన్ అని మీకు తెలుసో లేదో తెలియదు… మా పిల్లల్లో ఒకరి మధ్య పేరు ‘శేఖర్’… అది చంద్రశేఖర్ గారి పేరు మీద” అని చెప్పారు.సుబ్రహ్మణ్యన్ చంద్రశేఖర్ 1983లో నోబెల్ బహుమతి పొందిన, నక్షత్రాల నిర్మాణం మరియు పరిణామంపై కీలకమైన సిద్ధాంత అధ్యయనాలు చేసిన ప్రసిద్ధ ఆస్ట్రోఫిజిసిస్ట్.

శివోన్ జిలిస్‌కు ఇండియా మూలాలున్నాయని తెలిపారు. శివోన్ ఇండియాలో పెరిగిందా అని అడిగినప్పుడు మస్క్ స్పష్టం చేశారు. “ఆమెకు భారతదేశం అనేది రక్త సంబంధం, కానీ సాంస్కృతికంగా కాదు. ఆమె చిన్నప్పుడే దత్తతకు ఇచ్చేశారు. కెనడాలోనే పెరిగింది. ఆమె తండ్రి యూనివర్సిటీలో ఎక్స్చేంజ్ స్టూడెంట్ లాంటి వారు అని అనుకుంటాను” అని చెప్పారు.

జిలిస్ 2017లో న్యూరాలింక్‌లో చేరి ప్రస్తుతం ఆపరేషన్స్ మరియు స్పెషల్ ప్రాజెక్ట్స్ డైరెక్టరుగా పనిచేస్తున్నారు. IBM, బ్లూమ్బెర్గ్, బ్లూమ్బెర్గ్ బేటా వంటి సంస్థల్లో కీలక పాత్రలు నిర్వహించారు. USA టుడే ప్రకారం ఆమె ఒంటారియోలో పెరిగి, యేల్ యూనివర్సిటీలో ఎకనామిక్స్, ఫిలాసఫీ చదివింది. మస్క్ మాట్లాడుతూ:“కొన్ని కంపెనీలు H-1B ప్రోగ్రామ్‌ను దుర్వినియోగం చేశాయి, కానీ అందుకే మొత్తం ప్రోగ్రామ్‌ను మూసేయాలనే ఆలోచన తప్పు. దుర్వినియోగాన్ని ఆపాలి, కానీ H-1B ప్రోగ్రామ్‌ను నిలిపివేయకూడదు” అని తెలిపారు.

Also Read:అఖండ తాండవం..హై మూమెంట్స్!

- Advertisement -