ఎలన్ మస్క్‌ చేతికి ట్విట్టర్

328
mask
- Advertisement -

సినిమా ట్విస్ట్‌లను తలపించేలా సాగిన ట్విట్టర్ కొనుగోలు వ్యవహారం ఎట్టకేలకు ముగిసింది. ట్విట్టర్‌ను సొంతం చేసుకున్నారు టెస్లా సీఈవో ఎలన్ మస్క్‌. 44 బిలియన్ డాలర్లు(3.60 లక్షల డాలర్లు) తో ట్విట్టర్‌ను సొంతం చేసుకున్న మస్క్‌…కాసేపటికే ప్రస్తుత సీఈవో పరాగ్ అగర్వాల్‌తో పాటు పలువురు ఉద్యోగులను తొలగించి సంచలనం సృష్టించారు.

వాస్తవానికి ట్విట్టర్‌ను కొనుగోలు చేసేందుకు మస్క్ కొంతకాలంగా ప్రయత్నాలు చేశారు. తర్వాత వెనక్కి తగ్గారు. ఇక చివరగా ట్విట్టర్‌ను సొంతం చేసుకోన్నారు. సంస్థ తన చేతికి రాగానే సమూల మార్పులకు శ్రీకారం చుట్టారు. తొలిచర్యలో భాగంగా ఉన్నతస్ధాయి ఉద్యోగులపై వేటు వేశారు.

కంపెనీలో దాదాపు 7,500 మంది ఉద్యోగుల్ని తగ్గించాలనుకుంటున్నారు. భవిష్యత్తులోనూ ఎలన్ మస్క్ కంపెనీలో పలు మార్పులు చేయబోతుండగా తాను డబ్బు సంపాదన కోసం ఈ సంస్థను కొనుక్కోలేదని, మానవత్వాన్ని పెంచేందుకే ట్విట్టర్ కొనుగోలు చేశానని వెల్లడించారు.

ఇవి కూడా చదవండి..

- Advertisement -