ఎలాన్ మస్క్ మరో సంచలనం!

13
- Advertisement -

టెస్లా అధినేత ఎలాన్ మస్క్ మరో సంచలన ప్రకటన చేశారు. గతంలో ఎక్స్‌ను కొనుగోలు చేసినట్లు ప్రకటించిన మస్క్ తాజాగా దానిని అమ్మేసినట్లు ప్రకటించిన సంచలనం రేపారు.

ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌ సంస్థ అయిన xAIకి ఎక్స్‌ ను 33 బిలియన్ల డాలర్లకు విక్రయించినట్లు తెలిపారు. ఎక్స్‌ఏఐ విలువను 80 బిలియన్‌ డాలర్లుగా నిర్ధరించారు.

2022 అక్టోబర్‌లో ట్విటర్‌ను ఎలాన్‌ మస్క్‌ కొనుగోలు చేసిన విషయం తెలిసిందే. ఆ తర్వాత ఎక్స్‌లో అనేక మార్పులు చేపట్టారు. తొలుత పేరును ట్విటర్‌ నుంచి ఎక్స్‌ గా మార్చారు. అదేవిధంగా ట్విట్టర్ పిట్ట స్థానంలోకి X‌ ను చేర్చారు. దాదాపు 75 శాతం మంది ఉద్యోగులను తొలగించారు. కంటెంట్‌ విషయంలోనూ అనేక మార్పులు తీసుకొచ్చారు.

Also Read:ఘనంగా టీడీపీ 43వ ఆవిర్భావ వేడుకలు

- Advertisement -