ఈవీఎంలు వద్దు.. మస్క సంచలనం!

3
- Advertisement -

అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో ఈవీఎంలను ఉయోగించవద్దన్నారు టెస్లా సీఈవో ఎలాన్‌ మస్క్‌. అమెరికా నియంత్రణలోని ప్యూర్టోరికోలో ఇటీవల నిర్వహించిన ప్రైమరీ ఎన్నికల్లో అవకతవకలు చోటు చేసుకున్నాయన్న ఆరోపణల నేపథ్యంలో స్పందించిన మస్క్…ఈవీఎంలు హ్యాకింగ్‌కు గురవ్వడం పట్ల ఆందోళన వ్యక్తం చేశారు.

ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రాలను తొలగించాలి…. వీటిని వ్యక్తులు లేదా ఏఐ (AI) సాయంతో హ్యాక్‌ చేసే ప్రమాదం ఉందన్నారు. ఇది దేశానికి నష్టాన్ని కలిగిస్తుంది.. ప్యూర్టోరికోలో ఇటీవల తలెత్తిన ఎన్నికల వివాదాల కారణంగా అక్కడి అధికారులు ఈవీఎంల భద్రతపై దృష్టి సారించారు.

ప్యూర్టోరికోలో నిర్వహించిన ప్రైమరీ ఎన్నికల్లో ఈవీఎంల అవకతవకలు చోటు చేసుకొన్నాయి. ఈ నేపథ్యంలో స్పందించిన అధికారులు పేపర్ ట్రయల్‌ ఉంది కాబట్టి సమస్యను గుర్తించగలిగాము. లేదంటే ఏం జరిగేదో.. ఈ సమస్యలను నివారించడానికి పేపర్ బ్యాలెట్‌లను తిరిగి తీసుకురావాలన్నారు.

Also Read:గం గం గ‌ణేశా..ఓటీటీ డేట్ లాక్!

- Advertisement -