ఎలక్షన్ రిజల్ట్స్‌….పెళ్లిలో లైవ్..!

339
marriage election results live
- Advertisement -

సార్వత్రిక ఎన్నికల పోలింగ్ ముగియడం,కౌంటింగ్‌కు మరికొద్దిగంటలు మాత్రమే మిగిలిఉండటంతో అందరిలో టెన్షన్ నెలకొంది. కౌంటింగ్ నేపథ్యంలో అంతా టీవీల ముందు వాలిపోనుండటంతో ఓ వ్యక్తి వినూత్న ఆలోచన చేశాడు. తన కుమార్తె పెళ్లికి ఎవరొస్తారో రారో అన్న టెన్షన్‌తో ఓ తండ్రి ఏకంగా పెళ్లిలో ఎలక్షన్ రిజల్ట్స్‌ లైవ్‌లో చూడంటి అంటూ శుభలేఖలో అచ్చు వేయించారు.

మే 23న పెళ్లిళ్లు ఎక్కువగా ఉండటం మరోవైపు ఎన్నికల ఫలితాలు వెలువడనుండటంతో ఈ నిర్ణయానికి వచ్చారు నెల్లూరు లోని ప్రముఖ వస్త్ర వ్యాపారి భయ్యా వాసు. సరికొత్తగా ఆలోచనతో ఆ తండ్రి వేసిన శుభలేక అందరిని ఆకర్షిస్తోంది.

బయ్యా వాసు కుమార్తె వివాహం ఉదయం 11.50గంటలకు ముహూర్తం నిర్ణయించారు. అదే టైం లో పెళ్ళికి వచ్చిన వారికోసం లైవ్ స్క్రీన్ ఏర్పాటు చేస్తున్నారు. ఓ వైపు పెళ్లికి హాజరైనట్లుంటుంది మరోవైపు ఎన్నికల ఫలితాలు మిస్ కాకుండా ఈ వస్త్రవ్యాపారి చేస్తున్న ప్రయత్నం స్ధానికంగా చర్చనీయాంశంగా మారింది.

- Advertisement -