- Advertisement -
దేశవ్యాప్తంగా సార్వత్రిక ఎన్నికల కౌంటింగ్‌కు సమయం దగ్గరపడుతోంది .ఇవాళ సాయంత్రం 6.30 గంటల తర్వాత ఎగ్జిట్ పోల్స్ వెల్లడికానుండగా జూన్ 4న ఫలితాలు రిలీజ్ కానున్నాయి. ఇక ఎన్నికల ఫలితాల నేపథ్యంలో ఏపీలో మద్యం షాపులు మూతపడనున్నాయి.
జూన్ 3 నుంచి జూన్ 5 వరకు రాష్ట్రవ్యాప్తంగా ఉన్న మద్యం షాపులు బంద్ చేయబడతాయని డీజీపీ హరీష్ కుమార్ గుప్తా వెల్లడించారు. ఓట్ల లెక్కింపు సజావుగా సాగేందుకు, అల్లర్లు చెలరేగకుండా ముందు జాగ్రత్త చర్యగా మూడు రోజుల పాటు వైన్స్ షాపులను బంద్ చేయాలని రాష్ట్ర డీజీపీ ఆదేశాలు జారీ చేశారు.
అదేవిధంగా హోటళ్లు, లాడ్జిలలో తనిఖీలు చేపట్టి అనుమానితులను అదుపులోకి తీసుకోవాలని జిల్లాల సిబ్బందిని ఆదేశించారు. సోషల్ మీడియాలో తప్పుడు సమాచారం వ్యాప్తి కాకుండా చర్యలు తీసుకోవాలని పోలీసులకు సూచించారు.
Also Read:చేతిలో జపమాలతో మోడీ!
- Advertisement -