మరికాసేపట్లో ఓట్ల లెక్కింపు ప్రారంభం..

209
COunting

దేశ వ్యాప్తంగా సార్వత్రిక ఎన్నికల కౌంటింగ్ మరికొద్ది క్షణాల్లో ప్రారంభంకానుంది. ఈఫలితాల కోసం దేశవ్యాప్తంగా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. హోరాహోరీగా సాగిన ఎన్నికల పోరులో గెలిచేదెవరు? ఓడేదెవరు? 42 రోజుల నిరీక్షణకు మరికొన్ని గంటల్లో తెరపడనుంది. కౌంటింగ్ కు సంబంధించిన ఇప్పటికే అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు ఎన్నికల సంఘం అధికారులు. కౌంటింగ్ కేంద్రాల వద్ద ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా పటిష్ట బందోబస్తును ఏర్పాటు చేశారు అధికారులు.

కౌంటింగ్ హాల్ లోకి సెల్ ఫోన్లు అనుమతించబోమని స్పష్టం చేశారు. కౌంటింగ్ ఏజెంట్లు గుర్తింపు కార్డులు తీసుకురావాలని సూచించారు. ఫొటో, వీడియో జర్నలిస్టులను గ్రూపులవారీగా ఆయా కేంద్రాల్లోకి అనుమతించనున్నట్టు తెలిపారు. ఉదయం 8గంటలకు ఓట్ల లెక్కింపు ప్రారంభంకానుంది. తెలంగాణలోని 119 అసెంబ్లీ నియోజకవర్గాల పరిధి లో 18 జిల్లాల్లో 35 కేంద్రాలను ఏర్పాటుచేశారు. రాష్ట్రవ్యాప్తంగా 10 వేల మందితో పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశారు.