KTR:బీజేపీ కనుసన్నల్లో ఎన్నికల కమిషన్

15
- Advertisement -

ఎన్నికల కమిషన్ బీజేపీ కనుసన్నులో నడుస్తోంది… మేము స్పష్టంగా ఆరోపణలు చేస్తున్నాం అన్నారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. జాతులు, మతాల ఆధారంగా స్వయంగా ప్రధాని మోడీ, హోంశాఖ మంత్రి అమిత్ షా దారుణంగా వ్యాఖ్యలు చేసిన సరే వారిపై చర్యల్లేవ్…బీజేపీ సోషల్ మీడియాలో ముస్లింలపై డైరెక్ట్ గా విషం చిమ్ముతూ పోస్ట్ లు చేస్తున్నారన్నారు.

మోడీ డైరెక్ట్ గా ముస్లింలే ఎక్కువ మంది పిల్లలను కంటారని ఇష్టానురీతిగా వ్యాఖ్యలు చేశారు…ఈ వ్యాఖ్యలపై దాదాపు 20 వేల కంప్లైంట్స్ వచ్చాయి. కనీసం మోడీ గారికి నోటీసులు కూడా ఇవ్వలేదు అన్నారు.మోడీకి భయపడి బీజేపీ అధ్యక్షుడు నడ్డా కి ఈసీ నోటీసులు ఇచ్చింది,ఎన్నికల్లో అమిత్ షా దేవుడి ఫోటో పెట్టుకొని ప్రచారం చేస్తే ఆయన పై చర్యల్లేవ్ అన్నారు.

బీజేపీ అధికారిక ట్విట్టర్ హ్యాండిల్ లో రాముడి ఫోటో పెట్టుకొని ఓట్లు అడుగుతున్నారు…ప్రధాని మోడీ విద్వేష వ్యాఖ్యలు చేసిన, అమిత్ షా దేవుని ఫోటోలు పెట్టుకొని ఓట్లు అడిగిన ఎన్నికల కమిషన్ చర్యలు తీసుకోదు అన్నారు.కానీ కేసీఆర్ విషయంలో మాత్రం…ఆగమేఘాల మీద నోటీసులు ఇచ్చారు,సిరిసిల్లలో జరిగిన ప్రెస్ మీట్ కేసీఆర్ గారు కాలం తెచ్చిన కరువు కాదు. కాంగ్రెస్ తెచ్చిన కరువు అన్నారు,బతుకమ్మ చీరల ఆర్డర్లు ఇవ్వటం లేదని నేతన్నలు ఆవేదనతో చెబితే కేసీఆర్ దానిపై స్పందించారన్నారు.

నిరోధ్ లు, పాపాడాలు అమ్ముకోవాలని ఒక దుర్మార్గుడు అంటే దాన్ని ఖండిస్తూ కొంచెం కఠిన పదం వాడారు,దీనిపై ఐతే చర్యలు తీసుకున్నారు. మరి రేవంత్ రెడ్డి మీద ఎందుకు చర్యలు తీసుకోలేదు అని ప్రశ్నించారు. రేవంత్ రెడ్డి పై మేము ఎన్ని ఫిర్యాదులు చేసిన ఈసీ పట్టించుకోలేదు,తుక్కుగూడ సభలో రేవంత్ రెడ్డి చాలా అధ్వాన్నంగా మాట్లాడారు,రేవంత్ రెడ్డి మాట్లాడిన మాటలు నీతి సూక్తులు, ప్రవచనాలు, సుభాషితాలా? ఆలోచించాలన్నారు. మోడీ, నడ్డా, రేవంత్ రెడ్డి లకు నోటీసులు ఇవ్వటానికి ఈసీ ఎందుకు భయపడుతోంది…కేసీఆర్ పై ఫిర్యాదు వస్తే మాత్రం ఆగమేఘాల మీద చర్యలు తీసుకున్నారు అన్నారు. సత్యమేవ జయతే..సత్యమే గెలుస్తుంది. మాకు ఆ నమ్మకం ఉంది. న్యాయస్థానంలో పోరాడుతాం,కాంగ్రెస్, బీజేపీ రెండు ఒక్కటే. ఈసీ కచ్చితంగా మోడీ, రేవంత్ పై కూడా చర్యలు తీసుకోవాలె అన్నారు.

Also Read:వైసీపీనే గెలిపిస్తాం..పెన్షనర్ల శపథం!

- Advertisement -