యాసంగి రైతు బంధు సాయం నిలుపుదల చేయాలని ఈసీ ఆదేశాలు జారీ చేసింది. 25వ తేదీన రైతు బంధు కు పర్మిషన్ ఇచ్చింది ఈసీ. ఇక 26వ తేదీన మంత్రి హరీష్ రావు ఎన్నికల ర్యాలీలో రైతు బంధు ఈనెల 28న అందరి అకౌంట్ లో జమ చేస్తున్నామని చెప్పగా దానిని మోడల్ కోడ్ ఉల్లంఘన కింద పరిగణించింది ఇసి. దీంతో స్టార్ క్యాంపైనర్ గా ఉండి రైతు బంధు పై ప్రచారం చేయడాన్ని తప్పుపట్టింది.
నిన్న సీఈవో వికాస్ రాజ్ ను రిపోర్ట్ అడిగి ఇవాళ నిలుపుదల చేసేందుకు మార్గదర్శకాలు జారీ చేసింది.
ప్రతి యేటా వానాకాలం సీజన్ మరియు యాసంగి సీజన్ ప్రారంభం అయిన వెంటనే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రైతులకు పంట పెట్టుబడి ఆర్థిక సహాయంగా రైతుబందు నిధులను విడుదల చేస్తున్నది. అదే విధంగా ఈ యాసంగి సీజన్ కు సంబంధించిన రైతుబందు ను గతంలో వలె తక్కువ భూ విస్తీర్ణం వున్న రైతులకు మొదటగా ఇచ్చే పద్ధతిలో పంపిణీ చేసే ప్రక్రియను ప్రారంభించనున్నట్లు రాష్ట్ర వ్యవసాయ శాఖ తెలిపింది.
ఈ నెల 25, 26 ,27 తేదీల్లో బ్యాంకు హాలిడేస్ వున్నవి. అలాగే ఈ నెల 29, 30 తేదీల్లో రైతుబంధు పంపిణీ కి ఎన్నికల కమిషన్ అనుమతించలేదని తెలిపింది. తదనుగుణంగా రైతు బంధు పెట్టుబడి ఆర్థిక సహాయాన్ని రైతుల బ్యాంక్ ఖాతాలలో DBT పద్ధతిలో నేరుగా జమజేయుటకు నిధులను విడుదల చేయనున్నట్లు తెలిపింది. రైతు బంధు ద్వారా ఈ యాసంగి సీజన్లో 70 లక్షల మంది రైతులు లబ్ది పొందనున్నట్లు రాష్ట్ర వ్యవసాయ శాఖ తెలిపింది. అయితే ఈసారి పోలింగ్ అయిన తర్వాత యాసంగి నిధులు విడుదలయ్యే అవకాశం ఉంది.
Also Read:తెలుగు రాష్ట్రాల్లో కార్తీక పౌర్ణమి శోభ