మోదీ బయోపిక్‌ విడుదల వాయిదా..

215
modibiopic
- Advertisement -

ప్రధాని నరేంద్రమోదీ జీవితాధరంగా ‘పీఎం నరేంద్ర మోదీ’ పేరుతో బయోపిక్ తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. ఈమూవీ విడుదల చుట్టూ వివాదాలు వెంటాడుతున్నాయి. ఎన్నికలకు ముందు ఈసినిమాను విడుదల చేయడానికి వీలులేదంటూ విపక్షాలు ఆందోళన చేశాయి. ఈ సినిమా రిలీజ్ అయితే, ఓటర్లను మభ్య పెట్టినట్లు అవుతుందనీ… సినిమా విడుదలపై స్టే విధించాలని కాంగ్రెస్ కార్యకర్తైన పిటిషనర్ సుప్రీంకోర్టును కోరారు.

అయితే ఈసినిమాకు ఇంకా సెన్సార్ ను పూర్తి చేసుకోలేదు. తాజాగా ఈసినిమా విడుదలపై సుప్రింకోర్టు తీర్పు వెలువడించింది. సినిమాకు సెన్సార్‌ బోర్డు నుంచి సర్టిఫికేట్‌ రానందున విడుదలను వాయిదా వేయలేమని వెల్లడించింది. సినిమా ఎన్నికల నియమావళిని ఉల్లంఘించిందా? లేదా? అన్నది కేంద్ర ఎన్నికలకమిషన్‌ చూసుకుంటుందని తెలిపింది.

తాజాగా ఈ సినిమా చూసిన ఎన్నికల కమిషన్.. ఎన్నికలు పూర్తయిన తరువాతే బయోపిక్ ని విడుదల చేయాలని ఆదేశాలు జారీ చేసింది. రేపు విడుదల కాబోయే ఈబయోపిక్ ను వాయిదా వేసింది ఎన్నికల కమిషన్. ఈచిత్రంలో మోదీ పాత్రలో బాలీవుడ్ నటుడు వివేక్ ఓబెరాయ్ నటించగా ఒమంగ్ కుమార్ దర్శకత్వం వహించారు.

- Advertisement -