మున్సిపల్ ఎన్నికలపై రాష్ట్ర ఎన్నికల సంఘం నేడు ఆల్ పార్టీ మీటింగ్ నిర్వహించారు. ఈ మీటింగ్ అనంతరం మీడియాతో మాట్టాడారు టీఆర్ఎస్ నేత గట్టు రామచంద్రరావు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మున్సిపల్ ఎన్నికల్లో టీఆర్ఎస్ పార్టీ ఘన విజయం సాధిస్తుంది. ఒడిపోతామని తెలిసి ప్రతిపక్ష పార్టీల నేతలు ఎన్నికల అధికారులపై ఇష్టం వచ్చినట్లు మాట్లాడారు. ప్రజాస్వామ్య వ్యవస్ధలో ప్రజా మద్దతుతోనే గెలుస్తరు. ప్రజల్లో బలం లేకపోవడంతోనే విపక్ష నేతలు ఇలా ప్రవర్తిస్తున్నారు.
ఆల్ పార్టీ మీటింగ్ నుంచి కాంగ్రెస్ నేతలు వాకౌట్ చేయడం సిగ్గు మాలిన చర్య అన్నారు. ఫిబ్రవరిలో మేడారం జాతర ఉన్న నేపథ్యంలో ఇప్పుడు ఎన్నికల నిర్వహణ చేస్తున్నారు. ఎన్నికల కమిషనర్ నాగిరెడ్డిపై మాకు సంపూర్ణ విశ్వాసం ఉంది. ఎన్నికలను పారదర్శకంగా జరుపుతున్నారు. ఎక్కడ ఎన్నికలు జరిగినా టీఆర్ఎస్ పార్టీ గెలుస్తుందని తెలిసి విపక్ష నేతలు ఇలా ఇష్టంవచ్చినట్లు కామెంట్లు చేస్తున్నారు. రాబోయే మున్సిపల్ ఎన్నికల్లో కూడా టీఆర్ఎస్ పార్టీ విజయం సాధిస్తుందని తెలిపారు.