ఎలక్షన్ కోడ్‌..సచివాలయం ప్రారంభోత్సవం వాయిదా

32
- Advertisement -

తెలుగు రాష్ట్రాల్లో ఎమ్మెల్సీ స్థానాలకు షెడ్యూల్ విడుదల చేసిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో హైదరాబాద్‌ లోకల్‌ బాడీ ఎమ్మెల్సీ రెండు ఎమ్మెల్సీ ఎన్నికల నోటిఫికేషన్ సందర్భంగా ఎలక్షన్ కోడ్‌ అమల్లోకి వచ్చింది. ఈనెల 16వ తేదీన నోటిఫికేషన్ విడుదల చేయనున్నారు. ఈ సందర్భంగా ఈ నెల 17వ తేదీన రాష్ట్ర సచివాలయ ప్రారంభోత్సవం సందర్భం గురించి సీఎస్‌ కేంద్ర ఎన్నికల సంఘంతో సంప్రదింపులు జరిపారు. కానీ వారి నుంచి ఎటువంటి ప్రతిస్పందన రాకపోవడంతో సచివాలయం ప్రారంభోత్సవం తాత్కాలికంగా వాయిదా వేస్తున్నట్టు ప్రభుత్వం ప్రకటించింది. తదుపరి తేదీని త్వరలో ప్రకటిస్తామని తెలంగాణ ప్రభుత్వం ఒక ప్రకటనలో తెలిపింది.

ఇవి కూడా చదవండి…

మండలి ఛైర్మన్‌గా బండా నామినేషన్‌..

రాజ్యసభ…రజనీ అశోక్‌రావు సస్పెండ్‌

తేజస్వికి లేఖ రాసిన పింకీ…

- Advertisement -