తెలంగాణలో టీఆర్‌ఎస్ పార్టీ ఎన్నికల ప్రచారంలో దూసుకుపోతోంది. ప్రచారంలో భాగంగా టీఆర్‌ఎస్ పార్టీ అభ్యర్థులు ఓటర్లను ఆకట్టుకునే ప్రయత్నం చేస్తున్నారు. నియోజకవర్గం పరిధిలో ఓటర్లను వ్యక్తిగతంగా కలుస్తూ వాళ్లతో సంభాషిస్తున్నారు. టీఆర్‌ఎస్ ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను వివరిస్తున్నారు. మన నాయకుడు కేసీఆర్.. కారు గుర్తుకే ఓటు వేయాలని ఓటర్లను అభ్యర్థిస్తున్నారు. గులాబీ పార్టీలోకి వలసలు పెరుగుతున్నాయి. సీఎం కేసీఆర్ సర్కార్ చేపడుతున్న అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలకు ఆకర్షితులవుతున్న ప్రధాన పార్టీల నాయకులు, కార్యకర్తలు, ఇతర సంఘాల వారు పెద్ద ఎత్తున టీఆర్‌ఎస్‌లో చేరుతున్నారు.
ఓవైపు టీఆర్‌ఎస్ పార్టీ అభ్యర్ధులు ప్రచారంలో దూసుకుపోతుంటే ప్రతిపక్షాలు ఇప్పటి వరకు కూడా తమ పార్టీ అభ్యర్ధులను ప్రకటించలేదు. దీంతో ఇతర పార్టీలు ప్రచారంలో ఎక్కడా కానరావడం లేదు. తెలంగాణలో ఎక్కడ చూసినా టీఆర్‌ఎస్ పార్టీ అభ్యర్ధుల ప్రచార హోరు జోరుగా సాగుతోంది. అటు ప్రజలు కూడా టీఆర్‌ఎస్ పార్టీ అభ్యర్ధులకు బ్రహ్మరధం పడుతున్నారు. మంగళహారతులతో మహిళలు టీఆర్‌ఎస్ పార్టీ అభ్యర్ధులకు ఘన స్వాగతం పలుకుతున్నారు. మా ఓటు టీఆర్‌ఎస్ పార్టీకే అంటూ నిండు మనసుతో టీఆర్‌ఎస్ పార్టీ అభ్యర్థులను దీవిస్తున్నారు. దీంతో తెలంగాణలో టీఆర్‌ఎస్ పార్టీ అభ్యర్థుల ప్రచార పర్వం, ప్రజల స్వాగతాలు చూస్తుంటే రానున్న ఎన్నికల్లో టీఆర్‌ఎస్ పార్టీ అభ్యర్థుల విజయం నల్లేరుపై నడకే అనిపిస్తోంది.