ఉపాధి హామీ పథకంలో జరుగుతున్న అవినీతికి అడ్డుకట్ట వేసేందుకు ఈకేవైసీ విధానాన్ని తీసుకురావాలని పంచాయతీరాజ్ శాఖ నిర్ణయం తీసుకుంది. ఈకేవైసీ పద్ధతిపై సిబ్బందికి శిక్షణ ఇచ్చి, ఆగష్టు 15 నుండి కొత్త విధానం చేపట్టాలని నిర్ణయం తీసుకున్నారు.
మంత్రులు, ఎమ్మెల్యేలు, హీరో హీరోయిన్ల, క్రీడాకారుల ఫొటోలతో ఉపాధి హామీ యాప్‌లో కూలీలుగా నమోదు చేస్తున్నారు కొంతమంది. రోజూ ఆ ఫోటోలను యాప్‌లో పెట్టి ఉపాధికి వస్తున్నట్లు హాజరు..ఇలా వేతనాలు తీసుకుంటున్నారు పలువురు సిబ్బంది.
నేషనల్ మొబైల్ మానిటరింగ్ సిస్టమ్ (NMMS) యాప్‌లో సెలబ్రెటీల ఫోటోలు పెట్టి డబ్బులు దండుకుంటుంది సిబ్బంది. సినీ, సీరియల్ నటులు, క్రీడాకారులు, రాజకీయ పార్టీల నేతల ఫొటోలు తీసి యాప్‌లో నమోదు చేస్తుండటంతో ఈ దోపిడీని నిలువరించేందుకు NMMS యాప్‌లో ఈకేవైసీ విధానాన్ని అనుసంధానం చేయాలని పంచాయతీ రాజ్ శాఖ నిర్ణయం తీసుకుంది.
Also Read:అడివి శేష్..’G2’రిలీజ్ డేట్

