లేడీ ప్రొడ్యూసర్ ఏక్తా కపూర్ ట్రెండ్ ప్రకారం సబ్జెక్టులను ఎంచుకుంటుంది.. సెన్సేషన్స్ సృష్టించడంతో పాటు.. సెక్సీ లేడీగా ప్రొడ్యూసర్ గుర్తింపు ఉంది. సినిమాలతో పాటు టెలివిజన్ సీరియల్స్ ను తెగ ప్రొడ్యూస్ చేసేస్తూ ఉంటారీమె. ప్రస్తుతం పలు ఛానళ్లలో ఈమె నిర్మాణంలో 12 సీరియల్స్ ప్రసారం అవుతున్నాయంటే.. ఏ స్థాయి టేస్ట్ ఉన్న నిర్మాత అనే విషయం అర్ధం చేసుకోవచ్చు.
ఇప్పుడు డాషింగ్ ప్రొడ్యూసర్ వెబ్ మీడియాలోకి కూడా ఎంట్రీ ఇస్తుండడం విశేషం. అయితే.. ఇందుకోసం ఎంచుకున్న సబ్జెక్టులు మాత్రం అన్నిటి కంటే పెద్ద సెన్సేషన్ గా చెప్పుకోవాలి. గే కాన్సెప్ట్ తో ‘బాయ్ గాళ్’ అంటూ ఓ సిరీస్ నిర్మిస్తుండగా.. ఇద్దరు అబ్బాయిలతో ఇంటిమేట్ సన్నివేశాలు.. ఇతరులు వీరిని చూసి నవ్వుకోవడంతో ఇది సాగుతుంది. మరో స్టోరీలో ‘దేవ్ డీడీ’. ఇది లెస్బియన్ థీమ్ తో సాగే వెబ్ సిరీస్. లేడీ దేవదాస్ మాదిరిగా ఉండే దేవ్ డీడీ లీడ్ హీరోయిన్ రోల్.. ఇతర అమ్మాయిలతో బాగా క్లోజ్ గా ఉంటుంది.
సబ్జెక్టుల ఎంపికలోనే డేరింగ్ చూపించడంలో ఓ చిన్న సీక్రెట్ ఉంది. వెబ్ మీడియాపై ప్రస్తుతం సెన్సార్ లేదు. అందుకే ఇలాంటి కాంట్రవర్సీ అంశాలను కూడా టచ్ చేసేందుకు నిర్మాతలు ఆలోచించడం లేదు. ఏక్తా కపూర్ కూడా ఇప్పుడిదే చేస్తున్నారు.