- Advertisement -
ముస్లీం సోదరులకు నిజామాబాద్ మాజీ ఎంపీ కల్వకుంట్ల కవిత ఈద్ ఉల్ ఫితర్ పర్వదిన శుభాకాంక్షలు తెలిపారు. ఈ పవిత్ర రంజాన్ మాసంలో ముస్లీంలు అత్యంత నియమనిష్టలతో కొనసాగించిన ఉపవాస దీక్షలతో ప్రార్థనలతో అల్లాహ్ అనుగ్రహానికి పాత్రులవ్వాలని ఆకాంక్షించారు. ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఉండాలని అల్లాహ్ ను ప్రార్ధిస్తున్నానని తెలిపారు.
ముస్లిం సోదరులకు రంజాన్ శుభాకాంక్షలు తెలిపారు నగర పోలీసు కమిషనర్ అంజనీ కుమార్ . ప్రతి ఒక్కరూ సుఖసంతోషాలతో ఉండాలని ఆ దేవుడిని ప్రార్థిస్తున్నానని తెలిపిన సీపీ ఇవాళ ప్రార్థనలు జరిగే ప్రాంతాల్లో ట్రాఫిక్ ఆంక్షలు ఉన్నాయని, వాహనదారులు సహకరించాలని విజ్ఞప్తి చేశారు.
- Advertisement -