‘ఇగో’తో ఇందు గోపి..

203
- Advertisement -

మా తుల్జా భవాని ఆశీస్సులతో వికెఎస్ ఫిలిమ్స్ బ్యానర్ లో కె ఆర్ విజయ్ కరణ్, కె ఆర్ కౌషల్, కె ఆర్ అనిల్ కరణ్ ల నిర్మాణం లో “ఆకతాయి” ఫేమ్ ఆశిష్, సిమ్రాన్ జంటగా ఆర్ వి సుబ్రహ్మణ్యం దర్శకత్వం వహిస్తున్న చిత్రం ‘ఇగో’ ( ఇందు గోపి). ఈ నూతన చిత్ర ప్రారంభోత్సవం ఆదివారం అన్నపూర్ణ స్టూడియో లో ఘనంగా జరిగింది. ముహూర్తపు సన్నివేశానికి క్లాప్ సాయి కార్తీక్ ఇవ్వగా, కెమెరా స్విచ్ ఆన్ శ్రీనివాస్ గౌడ్ చేశారు. తుమ్మలపల్లి రామసత్యనారాయణ గౌరవ దర్శకత్వం వహించారు.

 "Ego" Movie Opening

ఈ సందర్భంగా దర్శకుడు సుబ్రమణ్యం మాట్లాడుతూ.. “ఇద్దరి యంగ్ స్టర్స్ మధ్య కలిగే ఇగో నే ఈ చిత్ర ప్రధానాంశం. ఈ చిత్రం చాలా డిఫరెంట్ ఉంటుంది, ఈ బ్యానర్ లో ఇది నా రెండో చిత్రం అవ్వడం సంతోషంగా ఉంది అన్నారు.

ఈ చిత్ర నిర్మాత మాట్లాడుతూ.. “87 కథలు విన్న తరువాత సుబ్బు చెప్పిన ఈ కథ నచ్చి చేస్తున్న చిత్రమిది, ఈ సోమవారం నుంచే రామోజిఫిల్మ్ సిటీ లో షూటింగ్ ప్రారంభమవుతుంది,3 షెడ్యూల్‌లో షూటింగ్ పూర్తి చేసి సెప్టెంబర్ లో విడుదల చేయడానికి ప్రయతిస్తాం అంటూ తెలిపారు.

 "Ego" Movie Opening

రామసత్యనారాయణ మాట్లాడుతూ.. “ఇద్దరి ఇగో ఇష్టాల స్టోరీ నే ఈ చిత్రం. ఈ చిత్ర నిర్మాతలు బడ్జెట్ కు వెనకాడకుండా సినిమా పూర్తి చేసే రకం కనుక చిత్రం మంచి క్వాలిటీ గా ఉంటుందని నమ్ముతున్నా, ఈ చిత్రం లో నటించిన ప్రతి ఒక్కరికీ నా అభినందనలు తెలియచేస్తున్నా” అన్నారు. అనంతరం హీరో ఆశిష్ రాజ్, హీరోయిన్ సిమ్రాన్ లు మాట్లాడుతూ ఈ చిత్ర అవకాశం ఇచ్చినందుకు దర్శక నిర్మాతలకు మా కృతజ్ఞతలని తెలిపారు.

ఆశిష్ రాజ్, సిమ్రాన్ జంటగా నటిస్తున్న ఈ నూతన చిత్రానికి కొరియోగ్రాఫర్: విజ్ఞేష్, లిరిక్స్: భాస్కరభట్ల, కాసర్ల శ్యామ్, బాలాజీ, మేకప్: వేణు, స్టంట్స్: నందు, ఆర్ట్ డైరెక్టర్: ఆర్ కె రెడ్డి, సంగీతం: సాయి కార్తీక్, నిర్మాతలు: కె ఆర్ విజయ్ కుమార్, కె ఆర్ కౌషల్ కరణ్, కె ఆర్ అనిల్ కరణ్, కథ- స్క్రీన్ ప్లే- మాటలు- దర్శకత్వం : ఆర్ వి. సుబ్రహ్మణ్యం(సుబ్బు).

- Advertisement -