ఫ్రీజ్‌లో కోడి గుడ్లు..ఈ తప్పు చేయకండి!

20
- Advertisement -

గుడ్డును పోషకాల నిలయంగా పరిగణిస్తుంటారు. ఎందుకంటే మన శరీరానికి అవసరమైన అన్నీ రకాల పోషకాలు గుడ్డులో సమృద్ధిగా ఉంటాయి. విటమిన్ సి, పీచు పదార్థం మినహా మిగిలిన అన్నీ రకాల విటమిన్లు, ప్రోటీన్లు, పుష్కలంగా లభిస్తాయి. అందుకే ప్రతి రోజూ ఒక గుడ్డు తినాలని ఆరోగ్య నిపుణులు చెబుతుంటారు.

కోడిగుడ్లు తినడం వరకు ఓకే కానీ దానిని భద్రపరిచే విషయంలోనే జాగ్రత్తలు తీసుకోకపోతే ఇబ్బందులు తప్పవని హెచ్చరిస్తున్నారు నిపుణులు. ముఖ్యంగా రిఫ్రిజిరేటర్ లో ఉంచిన కోడిగుడ్లను తినకూడదని చెబుతున్నారు. వాస్తవానికి గుడ్లను రిఫ్రిజిరేటర్‌లో ఉంచడం వల్ల పాడవకుండా ఉంటాయని అంతా భావిస్తారు. కానీ గుడ్లను ఫ్రీజ్‌లో ఉంచితే కాల్షియం, ఒమేగా-3 కొవ్వు ఆమ్లాలు పోషకాలు నశిస్తాయని చెబుతున్నారు. ఇలా ఫ్రీజ్‌లో ఉంచిన గుడ్లను తినడం మంచిది కాదని చెబుతున్నారు.

ఫ్రీజ్‌లో ఉంచితే గుడ్లు తాజాగా ఉంటాయి కానీ అందులో ఉండే పోషకాలు నాశనం అవుతాయి. సాల్మొనెల్లా బ్యాక్టీరియా గుడ్లను కలుషితం చేసే అవకాశం ఉందని చెబుతున్నారు. ఒక్కోసారి గుడ్డు పైభాగం మురికిగా ఉంటే, అది ఫ్రిజ్‌లోని ఇతర వస్తువులకు సోకుతుంది… ఫ్రిజ్ వాసన కూడా వస్తుందని చెబుతున్నారు. అందుకే ఫ్రీజ్‌లో ఉండే గుడ్లను తినకపోవడం చాలా బెటర్.

Also Read:Supreme Court:కేజ్రీవాల్‌కు బెయిల్

- Advertisement -