సాధారణంగా గుడ్డు పోషకాల గని అనే సంగతి మనందరికి తెలిసిందే. గుడ్డులో మన శరీరానికి అవసరమైన అన్నీ పోషకాలు మెండుగా ఉంటాయి. అందుకే ప్రతిరోజూ ఒక గుడ్డు తినాలని వైధ్యులు సైతం చెబుతుంటారు. కానీ గుడ్డు మాదిరిగానే గుడ్డు పెంకులో చాలానే పోషకాలు ఉన్నాయనే సంగతి మీకు తెలుసా ? అవునండి.. గుడ్డు పెంకులో కూడా ఎన్నో పోషకాలు దాగి ఉన్నాయి. ..అందులోని పోషకాలు మన శరీరానికి మాత్రమే కాకుండా మొక్కలకు కూడా చాలా బాగా ఉపయోగ పడతాయి. .
గుడ్డు పెంకులో కాల్షియం పుష్కలంగా ఉంటుంది. కాబట్టి గుడ్డు పెంకును మెత్తగా పౌడర్ లా చేసుకొని ఒక గ్లాస్ పాలకు అర టీ స్పూన్ దీనిని కలిపి తాగితే శరీరానికి కాల్షియం మెండుగా లభిస్తుంది. ఇంకా గుడ్డు పెంకులో బోరాన్, మెగ్నీషియం, మాంగనీస్, ఇనుము.. వంటి ఇతరత్రా సూక్ష్మ పోషకాలు కూడా ఉంటాయి. ఇకపోతే గుడ్డు పెంకు చర్మ సౌందర్యానికి కూడా ఎంతో బాగా ఉపయోగ పడుతుంది దీనిని మెత్తగా పొడి చేసుకొని అందులో తేనె కలిపి పేస్ట్ లా తయారు చేసుకొని ఫేస్ కు అప్లై చేసి పది నిముషాల తరువాత చల్లటి నీటితో కడిగేసుకోవాలి. ఇలా చేయడం వల్ల మొఖం కాంతివంతంగా మారుతుంది.
ఇంకా జుట్టు పెరుగుదలకు కూడా గుడ్డు పెంకులు సహాయపడతాయి. వీటిని మెత్తగా పొడి చేసుకొని పెరుగులో కలుపుకొని జుట్టుకు అప్లై చేయడం వల్ల కుదుళ్ల నుంచి జుట్టు బలపడుతుంది. అంతే కాకుండా చుండ్రు, జుట్టు రాలే సమస్యలు కూడా తగ్గుతాయట. ఇక అన్నిటికంటే ముఖ్యంగా మొక్కలకు ఎరువులా కూడా గుడ్డు పెంకులను ఉపయోగించవచ్చు. ఇందులో నత్రజని, భాస్వరం ఉండడం వల్ల మొక్కల పెరుగుదలకు ఎంతగానో ఉపయోగ పడుతుంది. అందుకోసం మెత్తగా పొడి చేసుకొని మొక్కలకు వేస్తే సరిపోతుంది. గుడ్డుపెంకుల యొక్క పొడిని ఇంకా దంతపొడి గాను ఉకూడా ఉపయోగించవచ్చు. కాబట్టి గుడ్డుపెంకులను బయట పారవేయకుండా అవసరాన్ని బట్టి కూడా వాడుకోవచ్చని తెలుసుకోవాలి.
గమనిక
ఈ ఆర్టికల్ ఇంటర్నెట్ లోని సమాచారం మేరకు అందించడం జరిగింది. ఫాలో అయ్యే ముందు క్షుణ్ణంగా తెలుసుకొని నిపుణుల సలహాల మేరకు పాటించడం మంచిదని గమనించాలి.