చేతివేళ్లు జర భద్రం గురూ…

235
- Advertisement -

టెక్నాలజీ పెరుగుతున్న కొద్దీ మనం చేసే పనుల్లో కూడా చాలా మార్పులు జరుగుతున్నాయి. అవసరాన్ని మించి సెల్‌ ఫోన్లను, కంప్యూటర్లను యదేచ్చగా వాడేస్తున్నారు.

అంతేకాకుండా టెక్నాలజీ సాకుతో ఉదయం లేచిన దగ్గర నుంచి రాత్రి పడుకునే వరకు.. స్మార్ట్ ఫోన్లను తెగ వినియోగిస్తున్నారు. అయితే ఇప్పుడు ఈ టెక్నాలజి కొత్త సమస్యల్ని తెచ్చిపెడుతోంది.

Effects of Smartphones on our Fingers, Hands &amp

గంటల పాటు కంప్యూటర్లలో పనిచేస్తే.. చేతివేళ్లకు సమస్యలు తప్పవంటున్నారు ఆరోగ్య నిపుణులు. సెల్ ఫోన్‌తో పాటు కంప్యూటర్లను అత్యధికంగా ఉపయోగించే వారి సంఖ్య రోజు రోజుకీ పెరిగిపోతుందని, వాటి వాడకం ద్వారా కంటి సమస్యలు తప్పవన్న విషయం తెలిసిందే..

అయితే వీటిని ఉపయోగిస్తే కంటితో పాటు చేతి వేళ్లకు కూడా దెబ్బేనని తెలుసుకోవాలి అంటున్నారు ఆరోగ్య నిపుణులు. సెల్ ఫోన్‌ను అదేపనిగా చూస్తుండటం, చేతివేళ్లతో ఛాటింగ్ చేస్తుండటం.. అలాగే కంప్యూటర్లో మౌస్, కీబోర్డులను అదే పనిగా ఉపయోగించడం ద్వారా చేతి వేళ్ళలో నొప్పి ప్రారంభం అవుతుందని చెప్తున్నారు.

Effects of Smartphones on our Fingers, Hands &amp

అయితే ఆ నొప్పి నుంచి చేతివేళ్ళకు ఉపశమనం లభించాలంటే? చేతివేళ్లలో నొప్పి వున్న ప్రాంతంలో ఐస్ ప్యాక్ లేదా హాట్ ప్యాక్ పెట్టాలని సూచిస్తున్నారు.  చేతి వేళ్ల నొప్పిని తగ్గేందుకు కొన్ని వ్యాయామాలు చేయాలని, మణికట్టు ప్రాంతంలో నొప్పి వున్నట్లైతే చేతికి స్మైలీ బాల్‌ను నొక్కుతూ వుంటే సరిపోతుందని చెప్తున్నారు.

అయితే ..ఇలా చేసినా నొప్పి తగ్గలేదంటే.. వెంటనే ఫిజియోథెరపిస్టులను సంప్రదించాలని అంటున్నారు. అంతేకాకుండా క్యాల్షియంతో కూడిన ఆహారం తీసుకుంటూ.. ప్రతి రోజూ అరగంట నడవడం , చేతుల్ని తిప్పే వ్యాయామాలు చేస్తే మంచి ఉపశమనం లభిస్తుందని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు.

- Advertisement -