ఈటల vs బండి ” కోల్డ్ వార్ “.. ?

36
- Advertisement -

బీజేపీ చేరికల కమిటీ చైర్మెన్ ఈటల రాజేందర్ గత కొన్నాళ్లుగా పార్టీ మారతాడనే టాక్ వినిపిస్తున్న సంగతి తెలిసిందే. బీజేపీలో ఆయనకు సరైన ప్రాధాన్యం దక్కడం లేదని అందుకే ఆయన పార్టీ మారే ఆలోచనలో ఉన్నట్లు పదే పదే వార్తలు గుప్పుమంటున్నాయి. అయితే ఈ వార్తలను ఈటెల ఎప్పటికప్పుడు ఖండిస్తూనే ఉన్నారు. అయినప్పటికి ఇలాంటి వార్తలు మాత్రం ఆగడం లేదు. ఇక ఇటీవల ఆయన కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డితో కలిసి బీజేపీ అధిష్టానంతో సమావేశం అయిన సంగతి విధితమే.

ఈ సమావేశం అనంతరం పార్టీ మార్పుపై పెద్దగా స్పందించని ఈటల.. తాజాగా జరిగిన ప్రెస్ మీట్ లో పలు ఆసక్తికర విషయాలను ప్రస్తావించారు. ” తాను బీజేపీ నుంచి బయటకు వెళ్లిపోవాలని కొంతమంది కోరుకుంటున్నట్లు సంచలన వ్యాఖ్యలు చేశారు. అంతేకాకుండా తనను కించపరిచేవారు పార్టీలో ఉన్నారని అలాంటివారి గురించి తాను పట్టించుకొనంటూ తాను తరచూ పార్టీలు మారే వ్యక్తిని కాదని స్పష్టం చేశారు ఈటల. అయితే ఇంతవరకు బాగానే ఉన్నప్పటికి.. ఇంతకీ ఈటలను బీజేపీ నుంచి బయటకు పంపించాలని చూస్తున్న నేతలెవరూ అనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారిన ప్రశ్న.

Also Read: MODI:ఒకే దేశం రెండు చట్టాలా..? అవసరమా..!

గత కొన్నాళ్లుగా ఈటల రాజేందర్ మరియు బండి సంజయ్ మధ్య కోల్డ్ వార్ నడుస్తోందనే చర్చ పోలిటికల్ సర్కిల్స్ లో జోరుగా సాగుతోంది. పార్టీ అధ్యక్ష పదవి మార్పు పై ఇద్దరి మధ్య రగడ రాజుకున్నట్లు ఇన్ సైడ్ టాక్. అందుకే ఆ మధ్య ఈటల గురించి బండి సంజయ్ మాట్లాడుతూ ” పార్టీలో ఉండే వాళ్ళు ఉంటారు.. పోయే వాళ్ళు పోతారు ” అని వ్యంగ్యస్త్రాలు సంధించారు. ఇప్పుడు ఈటల మాట్లాడుతూ ” తాను బయటకు పోవాలని కొందరు కోరుకుంటున్నట్లు వ్యాఖ్యానించారు. ఈ వ్యాఖ్యలను పరోక్షంగా బండి సంజయ్ ని ఉద్దేశించే ఈటల అన్నారని కొందరి అభిప్రాయం. అయితే వీరిద్దరి మధ్య ఈ కోల్డ్ వార్ మరింత ముదిరితే బీజేపీకి తీరని నష్టం చేకూరే అవకాశం ఉందని ఆ పార్టీ నేతల్లో ఆందోళనలు మొదలయ్యాయి. మరి ఈ పరిణామాలు బీజేపీకి ఎలాంటి తలనొప్పులు తెస్తాయో చూడాలి.

Also Read: కన్ఫర్మ్.. కాంగ్రెస్ గూటికే !

- Advertisement -