- Advertisement -
ఐదు రోజుల్లో పసుపు బోర్డు ఏర్పాటు చేస్తా లేకుంటే రాజీనామా చేస్తా అని చెప్పి ధర్మపురి అరవింద్ ప్రజలను మోసం చేశారని నిజామాబాద్ జిల్లా టీఆర్ఎస్ ఈగ గంగారెడ్డి మండిపడ్డారు. మంగళవారం మీడియాతో మాట్లాడిన గత 2018 లో మాజీ ఎంపీ కవిత ప్రత్యేక చొరవ తీసుకొని 471 దివ్యాంగులకు బ్యాటరీ సైకిల్ లను అందించే విధంగా రూ.57లక్షల నిధులు మంజూరు చేసి ఎంతో కృషి చేశారని చెప్పారు.
కవిత చొరవతో మంజూరు అయిన బ్యాటరీ సైకిల్ లకు ఎంపీ ధర్మపురి అరవింద్ తమ స్టిక్కర్లు అతికించుకోవడం సిగ్గు చేటు అన్నారు. మోసపూరితమైన మాటలు చెప్పి గత ఎన్నికల్లో ఎంపీ అరవింద్ గెలిచారని మండిపడ్డారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీలను నెరవేర్చకుండా ఎంపీ అరవింద్ ఫోజులు కొడుతున్నారని చెప్పారు.
- Advertisement -