టాలీవుడ్‌లో ప్రస్తుతం రీ రిలీజ్‌ల హవా నడుస్తోంది. అయితే ఇప్పటివరకు స్టార్ హీరోలు నటించిన హిట్ సినిమాలు రీ రిలీజ్ కాగా తాజాగా ఓ చిన్న సినిమా మళ్లీ ప్రేక్షకుల ముందుకురానుంది. తరుణ్ భాస్కర్ దర్శకత్వంలో తెరకెక్కిన యూత్ పుల్ ఎంటర్‌టైనర్ ‘ఈ నగరానికి ఏమైంది’. 29 జూన్ 2018లో విడుదలైన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల సునామీ సృష్టించింది.
ఇక ఈ సినిమా విడుదలై 5 సంవత్సరాలు గుడుస్తున్న సందర్భంగా రీ రిలీజ్ చేయనున్నారు. జూన్ 29న ఈ చిత్రాన్ని రీ రిలీజ్ చేస్తున్నట్లు తెలిపారు దర్శకుడు తరుణ్ భాస్కర్. ఈ నగరానికి ఏమైంది సినిమా వచ్చి ఐదు సంవత్సరాలు అవుతోంది. అయితే నాకు మాత్రం నిన్ననే వచ్చినట్లుగా ఉంది. మీరంతా కలిసి ఈ చిత్రాన్ని సక్సెస్ చేశారు. కానీ ఐదేళ్ల కాలంలో ఎంతో మారింది. నా ప్రతి రూల్ బ్రేకైంది. కింద పడిపోయా. మళ్లీ అన్నింటిని పునర్‌నిర్మించుకుంటూ వచ్చానని వెల్లడించారు.
Also Read:బీజేపీ ” సినీ గాలం “.. వర్కౌట్ అవుతుందా ?
కేవలం థియేటర్లలో మాత్రమే కాదని, ఎంపిక చేసిన క్లబ్, కెఫేలలో విడుదల చేయనున్నట్లు తెలిపారు. మరోసారి మిత్రులతో కలిసి సినిమాని చూసి ఎంజాయ్ చేయండి అని వెల్లడించారు.
Also Read:పవన్ విజయ యాత్ర.. లక్ష్యమదే !