త‌రుణ్ భాస్క‌ర్ ‘ఈ నగరానికి ఏమైంది ?’ ట్రైల‌ర్..

227
Ee Nagaraniki Emaindi trailer
- Advertisement -

పెళ్లిచూపులు సినిమా త‌ర్వాత చాలా రోజులకు మ‌ళ్లి సినిమా తీశాడు డైరెక్ట‌ర్ త‌రుణ్ భాస్క‌ర్. విజ‌య్ దేవ‌ర‌కొండ‌ను హీరోగా ప‌రిచ‌యం చేస్తూ పెళ్లి చూపులు సినిమా తెరెకెక్కిన విష‌యం తెలిసిందే. ఇక ఆ చిత్రం ఘ‌న విజ‌యం సాధించ‌డంతో విజ‌య్ దేవ‌ర‌కొండ ఫుల్ క్రేజ్ వ‌చ్చేసింది. ఇక అప్ప‌టి నుంచి ఇప్ప‌టి వ‌ర‌కూ త‌రుణ్ భాస్క‌ర్ సినిమాలు చేయ‌లేదు. ఇక తాజాగా న‌గ‌రానికి ఏమైంది అనే సినిమా చేస్తున్నాడు. ఈమూవీ ట్రైల‌ర్ ను నేడు విడుద‌ల చేశారు. సురేశ్ బాబు నిర్మాత‌గా వ్య‌వ‌హిరిస్తున్న ఈసినిమాకు పెళ్లిచూపులు ఫేం మ్యూజిక్ డైరెక్ట‌ర్ వివేక్ సాగ‌ర్ సంగితం అందిస్తోన్నాడు. ట్రైలర్‌ను హీరో రానా విడుదల చేశాడు.

Ee Nagaraniki Emaindi trailer

ఇక నేడు విడుద‌లైన ఈ ట్రైల‌ర్ కు ప్రేక్ష‌కుల నుంచి మంచి స్పంద‌న వ‌స్తోంది. ఈసినిమాకు సంబంధించి షూటింగ్ దాదాపు పూర్తైన‌ట్టు తెలిపారు.త్వ‌ర‌లోనే సినిమాను ప్రేక్ష‌కుల ముంద‌కు తీసుకురానున్న‌ట్లు తెలిపారు. నీ గ్యాంగ్ తో థియేట‌ర్ కు రా చూసుకుందాం అనేది ఈసినిమా ట్యాగ్ లైన్. ప‌క్కా హైద‌రాబాద్ భాష‌తో ఈసినిమాలోని డైలాగ్ లు మార్రోగిపోతున్నాయి. మ‌ళ్ళి స్నేహితుల మ‌ధ్య ఉండే కాన్సెప్ట్ తోనే ఈసినిమాను తెర‌కెక్కించినట్టు తెలుస్తోంది. యూత్ ఫుల్ ఎంట‌ర్ టైన్ మెంట్ గా సినిమా తెర‌కెక్కుతోంది.

ట్రైల‌ర్ లోని కొన్ని డైలాగులు ప్రేక్ష‌కుల‌ను అల‌రిస్తున్నాయి. ‘పెళ్లి చూపులు’ సినిమాలోని డైలాగులను తలపించేలా ఈ సినిమా డైలాగులు ఉన్నాయి. ‘ఈరోజు ఆఫీస్‌కి ఎందుకుపోలే’ అని ఒకరు అడడగా ‘నాగుల పంచమి ఇయ్యాల అనే డైలాగ్ తో యూత్ బాగా క‌నెక్ట‌య్యారు. ఇక ఈట్రైల‌ర్ పై హీరో నాని స్పందించారు. ఈ మధ్యకాలంలో తాను చూసిన ట్రైలర్‌లలో చాలా సహజంగా, ఫన్‌గా ఉన్న ట్రైలర్‌ ఇదేనని అన్నాడు. ఈసినిమా పెద్ద విజ‌యాన్ని సాధించాల‌ని మ‌న‌స్ఫూర్తిగా కోరుకుంటున్నాన‌ని ట్విట్ట‌ర్ లో పోస్ట్ చేశారు.

- Advertisement -