KTR:విద్యతోనే వికాసం.. విద్యతోనే ఆత్మవిశ్వాసం

54
- Advertisement -

తెలంగాణ దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా నేడు తెలంగాణ వ్యాప్తంగా విద్యా దినోత్సవం జరుపుకుంటున్నారు. ఈసందర్భంగా మంత్రి కేటీఆర్‌ రాజన్న సిరిసిల్ల జిల్లాలో పర్యటిస్తున్నారు. గంభీరావుపేట మండలం గోరంట్యాలలోని పాఠశాలలో నూతనంగా నిర్మించిన అదనపు తరగతి గదులను ప్రారంభించారు. అలాగే ఎల్లారెడ్డిపేటలో పాఠశాల భవన సముదాయాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా అక్కడ ఏర్పాటు చేసిన సమావేశంలో మంత్రి పాల్గొననున్నారు. మంత్రి కేటీఆర్‌తో పాటుగా తెలంగాన ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు వినోద్‌కుమార్‌తో పాటు పలువురు నేతలు ఉన్నారు.

Also Read: ఇకపై ప్రభుత్వ రైస్ మిల్లులు..

ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ…విద్యతోనే వికాసం, విద్యతోనే ఆత్మవిశ్వాసం అని అన్నారు. ఎల్లారెడ్డిపేటకు డిగ్రీ కళాశాల కచ్చితంగా తీసుకువస్తామని అన్నారు. తెలంగాణలోని గ్రామీణ ప్రాంతాల్లో చదివి…అమెరికాలో ఉద్యోగం చేస్తున్నారని అన్నారు. గత పరిస్థితులు…9యేళ్ల పాలన పరిస్థితులు గురించి ప్రజలు ఆలోచించాలని కొరారు.

Also Read: సొంతగూటికి కోమటిరెడ్డి.. ?

- Advertisement -