దర్శకుడు శంకర్‌కు ఈడీ భారీ షాక్

7
- Advertisement -

తమిళ దర్శకుడు శంకర్‌కు ఈడీ భారీ షాక్ ఇచ్చింది.శంకర్‌కి చెందిన రూ.10.11 కోట్ల ఆస్తులను ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టర్‌ జప్తు చేసింది. రోబో సినిమా కేసులో భాగంగా జప్తు చేసినట్లు వెల్లడించింది.

రోబో సినిమా కథను ఆయన కాపీ కొట్టారని 2011లో తమిళ రచయిత ఆరూర్ తమిళ్‌నందన్ కేసు వేశారు. ఈ కేసుకు సంబంధించిన ఎఫ్ఐఆర్ ఆధారంగా ఈడీ విచారణ చేపట్టింది. ఇందులో భాగంగా ఆరూర్‌ కథకు, రోబో కథకు పోలికలు ఉన్నాయని.. దీనికి సంబంధించిన ఆధారాలు ఉన్నాయని ఈడీ స్పష్టం చేసింది.

కాపీరైట్‌ చట్టం 1957లోని సెక్షన్‌ 63ను శంకర్‌ ఉల్లంఘించారని ఈడీ వెల్లడించింది. ప్రపంచవ్యాప్తంగా రోబో సినిమా రూ.290 కోట్లు వసూలు చేసినట్లు ఈడీ వెల్లడించింది.

Also Read:పల్లీలతో లాభాలెన్నో!

- Advertisement -