మాజీ సీఎం జగన్‌కు ఈడీ షాక్

15
- Advertisement -

మాజీ సీఎం జగన్‌కు ఈడీ షాకిచ్చింది. రూ.800 కోట్ల విలువైన ఆస్తులు అటాచ్ చేసింది ఈడీ. గత 14 ఏళ్లుగా కొనసాగుతున్న మనీ లాండరింగ్ కేసులో రూ.800 కోట్ల విలువైన భూములు, షేర్లు జప్తు చేసింది ఈడీ.

2009-10 లో నమోదైన అవినీతి ఆరోపణల కేసులో చర్యలు తీసుకుంది. ఎంపీగా ఉన్న సమయంలో కంపెనీలకు లాభాలు కలిగించేందుకు వ్యాపార సంస్థల నుంచి లాభాలు పొందారని ఆరోపణలు వచ్చిన సంగతి తెలిసిందే.

హైదరాబాద్, బెంగళూరు నగరాల్లోని భూములు….పలు కంపెనీల్లోని వాటాలు అటాచ్ చేసింది ఈడీ. ఈ ఆస్తులు జగన్ వ్యక్తిగతం కంటే ఎక్కువగా ఆయన కుటుంబం సంబంధిత కంపెనీలు, సహచరుల పేర్ల మీద ఉన్నట్టు గుర్తించారు. ఇప్పటికే ఈ కేసులో విచారణ జరుపుతోంది CBI.

Also Read:త్వరలో భూభారతి టోల్ ఫ్రీ నెంబర్

- Advertisement -